Kiran Abbavaram : మళ్ళీ ఇంకో సినిమా.. ఇంత ఫాస్ట్ ఏంటి బాబు.. సూపర్ ఫాస్ట్ కిరణ్ అబ్బవరం..

వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమా రిలీజై ఇంకా నెల రోజులు కాకుండానే నెక్స్ట్ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశాడు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఇంకో సినిమా ప్రకటించి పూజా కార్యక్రమాలు............

Kiran Abbavaram : మళ్ళీ ఇంకో సినిమా.. ఇంత ఫాస్ట్ ఏంటి బాబు.. సూపర్ ఫాస్ట్ కిరణ్ అబ్బవరం..

Kiran Abbavaram announce another movie

Kiran Abbavaram :  ‘రాజావారు రాణిగారు’ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయ్యాడు కిరణ్ అబ్బవరం. ఇండస్ట్రీలో ఎవరి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఫస్ట్ మూవీతో మంచి పేరే తెచ్చుకున్నాడు. రెండో సినిమా ‘యస్.ఆర్. కళ్యాణమండపం’ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత సెబాస్టియన్ సినిమా డిజాస్టర్ గా మారింది. ఆ తర్వాత వచ్చిన సమ్మతమే కమర్షియల్ సక్సెస్ అవ్వకపోయినా పర్వాలేదనిపించుకుంది. ఆ తర్వాత నేను మీకు బాగా కావల్సిన వాడిని మూవీ కూడా డిజాస్టర్ అవడంతో కెరీర్ డేంజర్ లో పడింది.

మరో ఫ్లాప్ పడితే తన పనైపోయే స్థితిలో కిరణ్ అబ్బవరం అదృష్టం కొద్దీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమా చేశాడు. ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రావడంతో విజయం సాధించింది. ప్రస్తుతం ఉన్న యువ హీరోల్లో జయాపజయాలతో అసలు సంబంధమే లేకుండా ఆఫర్స్ అందుకుంటునే ఉన్నాడు. సినిమాల మీద సినిమాలు పూర్తి చేస్తూ రిలీజ్ కూ రెడీ చేసేస్తున్నాడు. కిరణ్ అబ్బవరం ఒక సినిమా విడుదలవగానే మరో సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తూ, ఇంకో సినిమాని సెట్స్ మీద పెట్టి, ఇంకో సినిమాని అనౌన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

Nayan-Vignesh : ఫస్ట్ టైం తమ కవల పిల్లలతో బయట కనపడ్డ నయన్, విగ్నేష్..

‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమా రిలీజై ఇంకా నెల రోజులు కాకుండానే నెక్స్ట్ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశాడు. కిరణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ‘మీటర్’. రమేశ్ కడూరి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 7న సినిమా విడుదల కాబోతోంది. కనీసం ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఇంకో సినిమా ప్రకటించి పూజా కార్యక్రమాలు చేసేసాడు ఇవాళ. నేడు మార్చ్ 9న ఉదయం కిరణ్ అబ్బవరం మరో కొత్త సినిమా పూజా కార్యక్రమం జరిగింది. కొత్త దర్శకుడు విశ్వకరుణ్ దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూట్ కి వెళ్లనుంది. ఇవాళ్టి పూజా కార్యక్రమంకు సురేష్ బాబు, డైరెక్టర్ వివి వినాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీంతో కిరణ్ అబ్బవరం ఫాస్ట్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.