Meter Movie Teaser: టీజర్ టాక్.. పొగరుతో నడిచే మాస్ ‘మీటర్’ను పట్టుకొస్తున్న కిరణ్ అబ్బవరం

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ మూవీ అందించిన సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న కిరణ్ అబ్బవరం, అప్పుడే తన నెక్ట్స్ మూవీని రిలీజ్‌కు రెడీ చేశాడు. దర్శకుడు రమేష్ కాడూరి డైరెక్షన్‌లో పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ‘మీటర్’తో మనముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

Meter Movie Teaser: టీజర్ టాక్.. పొగరుతో నడిచే మాస్ ‘మీటర్’ను పట్టుకొస్తున్న కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram Impresses With Meter Movie Teaser

Meter Movie Teaser: టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ మూవీ అందించిన సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న కిరణ్ అబ్బవరం, అప్పుడే తన నెక్ట్స్ మూవీని రిలీజ్‌కు రెడీ చేశాడు. దర్శకుడు రమేష్ కాడూరి డైరెక్షన్‌లో పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ‘మీటర్’తో మనముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

Kiran Abbavaram: ‘మీటర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన కిరణ్ అబ్బవరం

కెరీర్‌లో తొలిసారి కిరణ్ అబ్బవరం పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్ ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మీటర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తోనే ప్రేక్షకుల చూపులు తనవైపుకు తిప్పుకున్న కిరణ్ అబ్బవరం, ఈ సినిమా టీజర్‌తో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశాడు. పక్కా మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది.

Kiran Abbavaram: రావణాసురతో పోటీకి ‘మీటర్’ను రెడీ చేసిన కిరణ్ అబ్బవరం

ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కిరణ్ అబ్బవరం పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యాడు. కాగా, ఈ సినిమాలో పవర్‌ఫుల్ డైలాగులు కూడా ఉండబోతున్నాయని ఈ టీజర్‌లో చిత్ర యూనిట్ చూపెట్టింది. తమిళ భామ అతుల్యా రవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. వేసవి కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.