Koratala Siva : ఆచార్య తర్వాత ఇన్నాళ్లకు మీడియా ముందుకు.. NTR 30 ఓపెనింగ్ లో కొరటాల శివ ఏం మాట్లాడాడో తెలుసా?

కొరటాల శివ మాత్రం ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. దాదాపు సంవత్సరం తర్వాత NTR 30 సినిమా ఓపెనింగ్ రోజు నేడు మీడియా ముందుకు వచ్చారు కొరటాల శివ. ఇన్ని రోజులు NTR 30 సినిమా మీద.................

Koratala Siva : ఆచార్య తర్వాత ఇన్నాళ్లకు మీడియా ముందుకు.. NTR 30 ఓపెనింగ్ లో కొరటాల శివ ఏం మాట్లాడాడో తెలుసా?

Koratala Siva Speech in NTR 30 Movie opening Ceremony

Koratala Siva :  సినీ పరిశ్రమలోకి రైటర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మెగా ఫోన్ పట్టారు కొరటాల శివ. ఫస్ట్ సినిమా ప్రభాస్ మిర్చి తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఆ తర్వాత కూడా వరుసగా శ్రీమంతుడు , జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో వరుస హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లతో కలిపి ఆచార్య సినిమా తీయగా ఇది ఘోర పరాజయం అయింది. ఈ సినిమా రిజల్ట్ పై చిరంజీవి చాల అప్ సెట్ అయ్యాడు. ఇండైరెక్ట్ గా అనేక సార్లు కొరటాలపై కౌంటర్లు వేశాడు. దీంతో వేరే ఫ్యాన్స్ కొరటాలకు సపోర్ట్ గా నిలబడి చిరంజీవి వల్లే సినిమా అలా అయిందంటూ కొరటాలకు వరుస హిట్స్ ఉన్నాయంటూ కొన్ని రోజులు సోషల్ మీడియాలో హడావిడి చేశారు.

అయితే కొరటాల శివ మాత్రం ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. దాదాపు సంవత్సరం తర్వాత NTR 30 సినిమా ఓపెనింగ్ రోజు నేడు మీడియా ముందుకు వచ్చారు కొరటాల శివ. ఇన్ని రోజులు NTR 30 సినిమా మీద బాగా వర్క్ చేసి గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు కొరటాల శివ. ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కొరటాల. దీంతో ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత మొదటిసారి కొరటాల శివ నేడు NTR 30 పూజా కార్యక్రమం రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు.

ఈ కార్యక్రమంలో కొరటాల శివ మాట్లాడుతూ.. జనతా గ్యారేజ్ తర్వాత మళ్ళీ ఆయనతో వర్క్ చేయడం నా అదృష్టం. నా బ్రదర్ లాంటి వాడు తారక్. ఇండియాలో ఉండే కొన్ని మర్చిపోయిన కోస్టల్ ల్యాండ్స్ కథే ఈ సినిమా. ఈ కథలో మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటారు. భయం అంటే ఏంటో తెలీదు, దేవుడంటే, చావంటే భయం లేదు. కానీ ఒకే ఒక్కటి అంటే భయం. ఆ భయం ఏంటో మీకు తెలుసు. భయం ఉండాలి, భయం అవసరం, భయపడాలి, భయ పెట్టడానికి సినిమాలో ప్రధాన పాత్ర ఏ రేంజ్ లో ఉంటుందో చూస్తారు. అందరికి ప్రామిస్ చేస్తున్నాను ఇది నా లైఫ్ లో బెస్ట్ సినిమా అవుతుంది. దీనికి బెస్ట్ టీమ్ ని తీసుకున్నాను. ఇలాంటి సినిమా బాగా రావాలంటే నేనెంత చేయాలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా అంతే చేయాలి అని అన్నారు. అలాగే సినిమాకి పని చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడారు.

NTR 30 : భారీగా NTR30 ఓపెనింగ్.. రాజమౌళి, ప్రశాంత్ నీల్.. అనేక మంది సినీ ప్రముఖుల సమక్షంలో..

దీంతో కొరటాల శివ ఎన్టీఆర్ 30 గురించి చెప్పిన దాని బట్టి చూస్తే ఈ సినిమా బాగా రా అండ్ రస్టిక్ గా ఉండబోతోందని తెలుస్తోంది. సినిమా ఓపెనింగ్ రోజే సినిమా గురించి ఈ రేంజ్ లో చెప్పి ఇప్పట్నుంచే సినిమాపై అంచనాలు పెంచేసాడు కొరటాల శివ. ఇక NTR 30 సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. మరి ఈ సినిమాతో కొరటాల కంబ్యాక్ ఇస్తాడా? ఎన్టీఆర్ కు RRR తర్వాత ఆ రేంజ్ సినిమా ఇస్తాడా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.