Rangamarthanda : ఉగాదికి కృష్ణవంశీ రంగమార్తాండ.. మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్..

డైరెక్టర్ కృష్ణవంశీ దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమాతో వస్తున్నాడు. 2017 లో తీసిన నక్షత్రం సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు రంగమార్తాండ సినిమాతో రాబోతున్నాడు. మరాఠాలో పెద్ద హిట్ సాధించిన నటసామ్రాట్ సినిమాని తెలుగులో రంగమార్తాండ సినిమాగా...................

Rangamarthanda : ఉగాదికి కృష్ణవంశీ రంగమార్తాండ.. మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్..

Rangamarthanda :  డైరెక్టర్ కృష్ణవంశీ దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమాతో వస్తున్నాడు. 2017 లో తీసిన నక్షత్రం సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు రంగమార్తాండ సినిమాతో రాబోతున్నాడు. మరాఠాలో పెద్ద హిట్ సాధించిన నటసామ్రాట్ సినిమాని తెలుగులో రంగమార్తాండ సినిమాగా తెరకెక్కించారు. ఫ్యామిలీ, ఎమోషన్స్ స్టోరీగా ఇది తెరకెక్కింది. రంగమార్తాండలో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్ తో ఇది డిఫరెంట్ సినిమా అని అర్థమైపోతుంది. ఇప్పుడొచ్చే కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉండబోతుంది రంగమార్తాండ. తాజాగా ఈ సినిమాని ఉగాది కానుకగా మార్చ్ 22న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా, స్టార్, కమర్షియల్ అంశాలు ఏం లేకపోయినా ఇదేదో కొత్తగా ఉండబోతుంది అనే ఫీల్ ని మాత్రం ఇస్తున్నారు కృష్ణవంశీ. ఈ సినిమాలోని పాటలన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు ఈ సినిమాకు. మూడేళ్ళ క్రితమే ఈ సినిమా మొదలయినా కరోనా కారణంగా ఈ సినిమా ఇన్ని రోజులు లేట్ అయింది.

Allu Arjun : బిగ్ అనౌన్స్‌మెంట్ ఉందంటున్న ఆహా.. అల్లు అర్జున్‌తో ఆహా కొత్త షో ప్లాన్ చేస్తుందా?

ఇక రంగమార్తాండ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉంది మైత్రి నిర్మాణ సంస్థ. ఇటీవల సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో వచ్చి భారీ హిట్స్ కొట్టారు. ఈ సినిమాలతోనే మైత్రీ సంస్థ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఈ సినిమాతో కృష్ణవంశీ మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి మరి.