Weather Update : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. వచ్చే పది రోజులు జాగ్రత్త..! హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి.. గజగజ వణకాల్సిందే..
Weather Update : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో ఇప్పటికే చలి పంజా విసురుతోంది. అయితే, వచ్చే పదిరోజులు చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని..
cold wave
Weather Update : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో ఇప్పటికే చలి పంజా విసురుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే పదిరోజులు చలితీవ్రత విపరీతంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read : Telangana Panchayat Elections : తెలంగాణలో పంచాయతీ పోరు.. బరిలో చంద్రబాబు, జగన్..!
రాష్ట్రంలో ఉత్తరాది జిల్లాల్లో ఇప్పటికే చలి ప్రభావం పెరిగింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీల మేరనే ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. సిర్పూర్ లో 10.4, అదిలాబాద్ జిల్లా సాత్నాలలో 10.8డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబిలో 12.7డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, పెద్దపల్లి, మెదక్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో 13 నుంచి 13.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే, రాబోయే పది రోజులు మాత్రం రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని, చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ కోల్డ్ వేవ్ పరిస్థితులు మరింత తీవ్రతరం కాబోతున్నాయని పేర్కొంటున్నారు
ఈనెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌లోనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఎక్కువ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తొలుత ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలిపంజా విసిరే అవకాశం ఎక్కువగా ఉందని, ఇటు హైదరాబాద్ నగరంలోనూ ఆదివారం నుంచి 10 రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
ఉత్తరాది జిల్లాల్లో టెంపరేచర్లు 5డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ టెంపరేచర్లు సింగిల్ డిజిట్ కు పరిమితంమవుతాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఐదు నుంచి 8డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతున్నారు. చేవెళ్ల, మొయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్ లలో ఐదు నుంచి ఎనిమిది డిగ్రీలు, హెచ్సీయూ, శేరిలింగంపల్లి, నానకరామ్ గూడ వంటి ప్రాంతాల్లో 6 నుంచి 8 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
