Rangamarthanda Teaser: రంగమార్తాండ టీజర్.. నువ్వొక చెత్త నటుడివి అంటూ క్యూరియాసిటీ పెంచేశారు!
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘రంగమార్తాండ’ ఎప్పుడో షూటింగ్ ముగించేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. అయితే సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ వచ్చిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌తో దుమ్ములేపుతోండగా, ఈ సినిమా విజయంపై కృష్ణవంశీ పూర్తి ధీమాతో ఉన్నాడు.

Rangamarthanda Teaser: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘రంగమార్తాండ’ ఎప్పుడో షూటింగ్ ముగించేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. అయితే సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ వచ్చిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌తో దుమ్ములేపుతోండగా, ఈ సినిమా విజయంపై కృష్ణవంశీ పూర్తి ధీమాతో ఉన్నాడు.
Rangamarthanda : ఉగాదికి కృష్ణవంశీ రంగమార్తాండ.. మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్..
ఇక మార్చి 22న ఈ సినిమాను మంచి అంచనాలతో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కాగా, తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. రంగమార్తాండ టీజర్ ఆద్యంతం ఎంగేజింగ్‌గా ఉండటమే కాకుండా సినిమాలోని పాత్రలపై క్యూరియాసిటినీ కూడా క్రియేట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో ‘నేనొక నటుడిని..’ అంటూ స్టార్ట్ అయిన ఈ టీజర్‌లో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణలతో పాటు ఇతర నటీనటులను కూడా పరిచయం చేశారు. ఇక బ్రహ్మానందం ఈ సినిమాలో విలక్షణమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘రేయ్.. నువ్వొక చెత్త నటుడివిరా.. మనిషిగా అంతకంటే నీచుడివి’’ అని ప్రకాశ్ రాజ్‌ను బ్రహ్మానందం చెంపదెబ్బ కొట్టే సీన్ ఈ టీజర్‌కే హైలైట్ అని చెప్పాలి.
Rangamarthanda: కృష్ణవంశీ మార్క్‌లో ‘రంగమార్తాండ’ టైటిల్ అనౌన్స్‌మెంట్.. !
ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాటను మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఆలపించారు. ఈ సినిమాకు ఆయన సంగీతం మరో బలంగా ఉండబోతుందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. మరి ఈ సినిమాకు థియేటర్ ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో తెలియాలంటే మార్చి 22 వరకు వెయిట్ చేయాల్సిందే.