Krithishetty : కృతిశెట్టి ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా?? కృతి ఎన్ని భాషలు మాట్లాడగలదో తెలుసా??

 'ఉప్పెన' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టి భారీ విజయం సాధించింది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే తెలుగులో చాలా మంది అభిమానుల్ని సంపాదించింది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్......

Krithishetty : కృతిశెట్టి ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా?? కృతి ఎన్ని భాషలు మాట్లాడగలదో తెలుసా??

Krithi Shetty(Image:Instagram)

Krithishetty :   ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టి భారీ విజయం సాధించింది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే తెలుగులో చాలా మంది అభిమానుల్ని సంపాదించింది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయి పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. ఉప్పెన తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’, ఇటీవల ‘బంగార్రాజు’తో హ్యాట్రిక్ హిట్ కొట్టింది. ఇటీవల ‘ఆలీ తో సరదాగా’ షోకి వచ్చిన కృతి తన గురించి చాలా విషయాలు తెలియచేసింది.

కృతిని ఎవరితో సినిమా చేయాలనుకుంటున్నావు అని అడుగగా… నాకు రామ్‌ చరణ్‌ గారంటే చాలా ఇష్టం. తెలుగులో నేను చూసిన తొలి చిత్రం ‘రంగస్థలం’. హిందీలో ఆయన డబ్బింగ్‌ సినిమాలు చూశాను. ‘రంగస్థలం’లో రామ్ చరణ్ నాకు చాలా బాగా నచ్చారు. ఆయనతో కలిసి పనిచేయాలని ఉంది. ఎప్పటికైనా రామ్ చరణ్ గారితో కలిసి పని చేయాలి” అని తెలిపింది.

MAA : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై సీనియర్ నటుడు నరేష్ వ్యాఖ్యలు

ఇక కృతి చాలా భాషలు మాట్లాడుతుందని తెలిపింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, తుళు మాట్లాడతానని, కన్నడ అర్థమవుతుంది అని, ఇప్పుడిప్పుడే తమిళం నేర్చుకుంటున్నాను అని తెలిపింది. ఇన్ని భాషలు రావడమంటే గ్రేట్ అని అంటున్నారు ప్రేక్షకులు.

Jyothi Reddy Death : నా బిడ్డ మృతిపై అనుమానాలున్నాయ్ : జూ.ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి తండ్రి

ప్రస్తుతం కృతి శెట్టి హీరో రామ్‌ సరసన ‘ది వారియర్‌’, సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్ సరసన ‘మాచర్ల నియోజకవర్గం’లో నటిస్తుంది. మరిన్ని సినిమాలు కూడా త్వరలో ఓకే చేయబోతుంది కృతి.