Lahari Shari : భారీగా ఖర్చు పెడుతున్న బిగ్‌బాస్ బ్యూటీ.. మొన్న ఖరీదైన బైక్.. ఇవాళ కార్..

ఇటీవలే లహరి షారి ఓ ఖరీదైన బైక్ ని కొనుగోలు చేసింది. ఆ కాస్ట్లీ బైక్ తో ఫొటోలు దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ కూడా చేసింది. ఈ బైక్ కొని కేవలం నెల రోజులు అయింది. అంతలోనే తాజాగా.....

Lahari Shari : భారీగా ఖర్చు పెడుతున్న బిగ్‌బాస్ బ్యూటీ.. మొన్న ఖరీదైన బైక్.. ఇవాళ కార్..

Lahari Shari

Lahari Shari :   బిగ్‌బాస్ కు వెళ్లొచ్చిన సెలబ్రిటీలు అంతకుముందు కంటే ఎక్కువ ఫేమస్ తెచ్చుకొని అవకాశాల్ని కూడా సాధిస్తారు. ఇక బిగ్‌బాస్ కి వెళ్లొచ్చాక ఆ ఫేమ్ తో డబ్బులు కూడా బాగానే సంపాదిస్తారు. బిగ్‌బాస్‌ సీజన్‌-5లో లేడీ అర్జున్‌రెడ్డిగా ఫేమస్ అయిన బ్యూటీ లహరి షారి. బిగ్ బాస్ రాకముందు ‘అర్జున్ రెడ్డి’తో సహా కొన్ని సినిమాల్లో నటించినా ఈ భామకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ షోతో ఫాలోయింగ్‌ బాగానే పెరిగింది. బిగ్‌బాస్ తర్వాత మెల్లిమెల్లిగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

ఇక బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చిన వాళ్ళు అంతా ఇల్లు, కార్లు ఇలా ఏవో ఒకటి కొనుక్కుంటారు. ఇటీవలే లహరి షారి ఓ ఖరీదైన బైక్ ని కొనుగోలు చేసింది. ఆ కాస్ట్లీ బైక్ తో ఫొటోలు దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ కూడా చేసింది. ఈ బైక్ కొని కేవలం నెల రోజులు అయింది. అంతలోనే తాజాగా ఖరీదైన కారుని కొనుగోలు చేసింది లహరి. లగ్జరీ కారు వోల్వో ఎక్స్‌సీ 60ని లహరి తాజాగా కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. ఇక ఈ ఖరీదైన కారుతో ఫొటోలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ కారు ధర దాదాపు 60 లక్షల రూపాయల పైనే ఉంటుందని సమాచారం.

Raviteja : రోజువారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న రవితేజ.. రోజుకి ఎంతో తెలుసా??

ఇలా వెంటవెంటనే భారీ ఖర్చులు చేస్తుంది అంటే అమ్మడికి ఆఫర్స్ కూడా భారీగానే వస్తున్నట్టు తెలుస్తుంది. బిగ్‌బాస్ తర్వాత లహరి షారి తన సెకండ్ ఇన్నింగ్స్ ని భారీగానే ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇక లహరి అభిమానులు, తోటి కంటెస్టెంట్స్ కార్ కొన్నందుకు విషెష్ తెలియచేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Lahari Shari (@lahari_shari)