Kerala : స్టేజిపై పాట పాడుతూ కుప్పకూలిపోయి మరణించిన సింగర్

తాజాగా అలప్పుజాలో జరిగిన బ్లూ డైమండ్‌ ఆర్కెస్ట‍్రా స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా బషీర్ ప్రదర్శన ఇస్తున్నారు. స్టేజి మీద పాట పాడుతున్న సమయంలో ఆయనకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి.....................

Kerala : స్టేజిపై పాట పాడుతూ కుప్పకూలిపోయి మరణించిన సింగర్

Basheer

Basheer : గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో సంగీత విభాగానికి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరు మరణిస్తూ సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపుతున్నారు. గడిచిన రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎంతోమంది సింగర్స్ కన్నుమూయగా తాజాగా మరో విషాదం నెలకొంది. కేరళకు చెందిన మలయాళ పరిశ్రమ ప్రముఖ గాయకుడు ఎడవ బషీర్‌ కన్నుమూశారు. ఒక మ్యూజిక్‌ లైవ్‌ కాన్సర్ట్‌లో పాట పాడుతూ స్టేజిపై ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించడం దురదృష్టకరం.

78 ఏళ్ల ఎడవ బషీర్‌ ‘గాన మేళా’తో కేరళలో ఎంతో పాపులర్‌ అయ్యారు. స్వాతి తిరునాళ్‌ మ్యూజిక్‌ అకాడమీ నుంచి అకాడమిక్‌ డిగ్రీ ‘గానభూషణం’ అభ్యసించారు. 1972లో కొల్లంలో ‘సంగీతాలయ’ గాన మేళాన్ని స్థాపించారు. రఘువంశం అనే సినిమాకు మొదటిసారిగా నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యారు. ఆతర్వాత పలు సినిమాలకు పాటలు పాడారు బషీర్. ఆల్‌ కేరళ మ్యూజిషియన్స్‌ అండ్‌ టెక్నిషియన్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

Deepika Padukone : అక్కడ చిన్న చిన్న వేషాలు వేయడం కంటే ఇక్కడ మంచి నటిగా చేయడం బెటర్..

తాజాగా అలప్పుజాలో జరిగిన బ్లూ డైమండ్‌ ఆర్కెస్ట‍్రా స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా బషీర్ ప్రదర్శన ఇస్తున్నారు. స్టేజి మీద పాట పాడుతున్న సమయంలో ఆయనకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఛాతీ నొప్పి భరించలేక స్టేజ్‌పైనే కుప్పకూలిపోయారు బషీర్. హుటాహుటని ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బషీర్‌ మరణించినట్లు వైద్యులు తెలిపారు. బషీర్ మరణానికి చింతిస్తూ మలయాళ సినీ, సంగీత పరిశ్రమలు నివాళులు అర్పిస్తున్నాయి.