Manoj – Mounika : మంచు మనోజ్ – మౌనిక పెళ్లి సాంగ్ చూశారా??

తాజాగా మంచు మనోజ్ - మౌనిక పెళ్లి వీడియోని ఒక పాట స్పెషల్ గా డిజైన్ చేయించి రిలీజ్ చేశారు. ఏం మనసో.. అంటూ సాగే ఈ సాంగ్ ని అనంత్ శ్రీరామ్ రాయగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అచు రాజమణి (Achu Rajamani) స్వరాలు అందించి, స్వయంగా పాడాడు.

Manoj – Mounika : మంచు మనోజ్ – మౌనిక పెళ్లి సాంగ్ చూశారా??

Manchu Manoj and Bhuma Mounika Wedding Song Released

Manoj – Mounika :  మంచు మనోజ్(Manchu Manoj) ఇటీవలే తన రాబోయే సినిమాని ప్రకటించి రెండో పెళ్లి కూడా చేసుకొని గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి(Bhuma Nagireddy) కూతురు భూమా మౌనికని(Bhuma Mounika) మార్చ్ 3 శుక్రవారం రాత్రి వివాహం చేసుకున్నాడు మనోజ్. వీరిద్దరిది ప్రేమ వివాహం కావడం, ఇద్దరికీ రెండో పెళ్లి కావడంతో హైదరాబాద్(Hyderabad) లోని మనోజ్ ఇంట్లోనే చాలా సింపుల్ గా వివాహం జరిగింది.

వివాహం తర్వాత మనోజ్ – మౌనిక ఎక్కడ కనపడినా హైలెట్ అవుతున్నారు. మౌనిక ఎక్కడికి వెళ్లినా పద్దతిగా చీరలో వెళ్తుండటం, ఇద్దరూ కలిసి వస్తుండటంతో ఈ జంట చాలా బాగుందని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే ఈ జంట ఒక టీవీ షోకి వచ్చారు. వెన్నెల కిషోర్ హోస్ట్ గా చేస్తున్న అలా మొదలైంది అనే షోకి మనోజ్ మౌనిక కలిసి వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజయి వైరల్ అవ్వగా, ఎపిసోడ్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

తాజాగా మంచు మనోజ్ – మౌనిక పెళ్లి వీడియోని ఒక పాట స్పెషల్ గా డిజైన్ చేయించి రిలీజ్ చేశారు. ఏం మనసో.. అంటూ సాగే ఈ సాంగ్ ని అనంత్ శ్రీరామ్ రాయగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అచు రాజమణి (Achu Rajamani) స్వరాలు అందించి, స్వయంగా పాడాడు. ఈ పాటలో మనోజ్, మౌనిక బయట ఎంజాయ్ చేసిన ఫొటోలని కూడా పొందుపరిచారు. ఈ వీడియో మొత్తంలో మనోజ్ – మౌనిక ఎంగేజ్మెంట్, పెళ్లిని చూపించారు. మనోజ్ మౌనికకు ప్రపోజ్ చేయడం, ఉంగరాలు మార్చుకోవడం, పెళ్ళికొడుకు, పెళ్లి కూతుర్ని రెడీ చేయడం, తాళి కట్టడం, తలంబ్రాలు, అరుంధతి నక్షత్రం.. ఇలా పెళ్లిలో ముఖ్యమైన ఘట్టాలన్నీ చూపించారు. వీడియో చివర్లో ఇది శివుని ఆజ్ఞ అని వేయడం విశేషం.

People Media Factory : 100 సినిమాలు టార్గెట్.. 15 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.. సైలెంట్ గా దూసుకొస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ..

ఇక ఈ వీడియోలో పెళ్ళికి వచ్చిన వాళ్ళందర్నీ చూపించారు. వైఎస్ విజయమ్మ, పలువురు రాజకీయ నాయకులు, సాయిధరమ్ తేజ్, సిద్దు జొన్నలగడ్డ, శివబాలాజీ, వెన్నెల కిషోర్.. పలువురు సినీ ప్రముఖులు వచ్చారు. ఇన్ని రోజులు మంచు విష్ణు మనోజ్ పెళ్ళికి రాలేదని అంతా అనుకున్నారు. కానీ తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో విష్ణు, అతని భార్య, పిల్లలు అంతా ఉండి పెళ్ళిలో సందడి చేయడం కూడా చూపించారు. ప్రస్తుతం మనోజ్-మౌనిక పెళ్లి వీడియో వైరల్ గా మారింది. ఈ పెళ్లి వీడియో చాలా క్యూట్ గా ఉందని, కొత్త జంటకు మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నారు అందరూ.