Manchu Manoj : వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్న మనోజ్.. కొత్త సినిమా అనౌన్స్‌మెంట్!

మంచు మనోజ్ పుట్టినరోజు కావడంతో తను సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తన కొత్త మూవీ..

Manchu Manoj : వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్న మనోజ్.. కొత్త సినిమా అనౌన్స్‌మెంట్!

Manchu Manoj announce his new movie and What The Fish glimpse

Manchu Manoj New Movie : 2017 ఒక్కడు మిగిలాడు (Okkadu Migiladu) సినిమా తరువాత మంచు మనోజ్ హీరోగా మరో సినిమాలో కనిపించలేదు. 2018 లో ఒక రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఆ తరువాత 2020లో ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాని రామ్ చరణ్ చేతులు మీదుగా చాలా గ్రాండ్ గా లాంచ్ చేసి.. దానిని మధ్యలోనే వదిలేశాడు. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న మనోజ్.. ఇటీవలే మళ్ళీ వరుస సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు.

What the Fish : భయం కొత్త రూపాన్ని తీసుకుంది.. మంచు మనోజ్ వాట్ ది ఫిష్ గ్లింప్స్ రిలీజ్..

ఇప్పటికే వాట్ ది ఫిష్ (What The Fish) అనే సినిమాని అనౌన్స్ చేసి ఆ మూవీ పనులు మొదలు పెట్టిన మనోజ్.. తాజాగా మరో సినిమాని అనౌన్స్ చేశాడు. నేడు (మే 20) తన బర్త్ డే కావడంతో.. తన సినిమాల అప్డేట్స్ ని ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎల్ ఎస్ ప్రొడక్షన్స్‌ లో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. భాస్కర్ బంటుపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. శ్రీమతి మమత సమర్పణలో ఎం శ్రీనివాసులు, డి వేణు గోపాల్, ఎం మమత, ముల్లపూడి రాజేశ్వరి సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Bichagadu 2 : ‘బిచ్చగాడు’కి కలిసొచ్చిన 2 వేల నోటు రద్దు.. మొదటిరోజు కలెక్షన్స్ అదుర్స్!

ఈ సినిమా డిఫరెంట్ జానర్‌ లో ఆడియన్స్ ముందుకు రాబోతుందని, మనోజ్ కెరీర్ లోనే ఇది ఒక కథతో రాబోతుందని తెలియజేశారు మేకర్స్. మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామంటు నిర్మాతలు వెల్లడించారు. ఇది ఇలా ఉంటే, మనోజ్ నటిస్తున్న వాట్ ది ఫిష్ చిత్రం నుంచి నేడు ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. గ్లింప్స్ లో గేమింగ్, డ్రగ్స్ వంటి సీన్స్ చూపించారు. అలాగే మనోజ్ ని కూడా గుడ్ అండ్ బ్యాడ్ లుక్స్ లో చూపించారు. ఇక ఈ గ్లింప్స్ కి మనోజ్.. ‘భయం కొత్త రూపాన్ని తీసుకుంది’ అంటూ కామెంట్ రాసుకు రావడంతో ఈ మూవీ కూడా ఒక కొత్త జానర్ లో తెరకెక్కుతోందని అర్ధమవుతుంది.

Manchu Manoj announce his new movie and What The Fish glimpse

Manchu Manoj announce his new movie and What The Fish glimpse

Manchu Manoj announce his new movie and What The Fish glimpse

Manchu Manoj announce his new movie and What The Fish glimpse