Manchu Vishnu: ప్రీలుక్‌తోనే క్యూరియాసిటీ పెంచేసిన జిన్నా..!

యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జిన్నా’ టైటిల్‌తోనే ప్రేక్షకుల చూపు తనవైపు తిప్పుకుంది. ఈ సినిమాను సూర్య అనే డైరెక్టర్ తెరకెక్కిస్తుండగా.....

Manchu Vishnu: ప్రీలుక్‌తోనే క్యూరియాసిటీ పెంచేసిన జిన్నా..!

Manchu Vishnu Ginna Pre Look Creates Curiosity

Manchu Vishnu: యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జిన్నా’ టైటిల్‌తోనే ప్రేక్షకుల చూపు తనవైపు తిప్పుకుంది. ఈ సినిమాను సూర్య అనే డైరెక్టర్ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాకు కథను ప్రముఖ నిర్మాత, రచయిత కోన వెంకట్ అందిస్తున్నారు. గతంలో కోన, విష్ణు కాంబినేషన్‌లో వచ్చిన ఢీ, దేనికైనా రెడీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీలుగా నిలిచాయి. దీంతో ఇప్పుడు మరసారి ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

Manchu Vishnu: ‘జిన్నా’గా మారిన గాలి నాగేశ్వర రావు!

అయితే ఈ సినిమాకు జిన్నా అనే టైటిల్‌ను పెట్టిన చిత్ర యూనిట్, తాజాగా ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ప్యాంట్ జేబుకి స్టైలిష్ గ్లాసులు వేలాడదీయగా, వాటిలో చేతికున్న బ్రాస్లెట్‌లోని ఆంజనేయ స్వామి బొమ్మను మనకు చూపించారు. ఇక ఈ ప్రీలుక్ మోషన్ పోస్టర్‌కు మాస్ మ్యూజిక్ బీజీఎంతో అదరగొట్టాడు అనూప్ రూబెన్స్. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను జూలై 11న ఉదయం 10.22 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించాడు.

ఈ సినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్ రావు అనే పాత్రలో నటిస్తున్నట్లు గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ సినిమాలో అందాల భామలు పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో మంచు విష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.