Varun – Lavanya : వరుణ్ – లావణ్య ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో మెగా, అల్లు కుటుంబాలు..
హైదరాబాద్ లోని నాగబాబు ఇంట్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్. ఇక ఈ నిశ్చితార్దానికి.. మెగా మరియు అల్లు కుటుంబసభ్యులు చేరుకుంటున్నారు.

mega and allu families at Varun Tej Lavanya Tripathi engagement function
Allu Arjun – Ram Charan : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి చేసుకుబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న (జూన్ 8) మెగా టీం నుంచి వీరిద్దరి ఎంగేజ్మెంట్ పై క్లారిటీ రావడంతో అభిమానులు కొత్త జంటకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక నేడు వీరిద్దరి నిశ్చితార్థం జరుగుతుండడంతో మెగా మరియు అల్లు కుటుంబసభ్యులు వేడుకకు చేరుకుంటున్నారు.
NTR – Ram Charan : ఎన్టీఆర్ అండ్ చరణ్ తో కలిసి నటించడం అదృష్టం అంటున్న థోర్..
హైదరాబాద్ లోని నాగబాబు ఇంట్లోనే జరుగుతున్న ఈ నిశ్చితార్దానికి.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan) సతీసమితంగా ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి చేరుకున్నారు. అలాగే వైష్ణవ తేజ్ తో మిగితా మెగా హీరోలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. వారితో పాటు ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తుంది.
Adipurush : ఆదిపురుష్ సీత ముద్దు వ్యవహారం పై.. రామాయణం సీరియల్ సీత కామెంట్స్..
కాగా వరుణ్ అండ్ లావణ్య మిస్టర్ (Mister), అంతరిక్షం అనే సినిమాల్లో కలిసి నటించారు. అంతరిక్షం సినిమా సమయం నుంచే వీరిద్దరూ క్లోజ్ అయ్యారని, ఆ తర్వాత లవ్ లో పడినట్లు సమాచారం. ఇక అప్పటి నుంచి సీక్రెట్ ప్రేమాయణం నడుపుతూ వస్తున్నారు. మెగా ఫ్యామిలీలో జరిగే కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కూడా లావణ్య హాజరయ్యేదని వార్తలు వినిపించేవి.