చిరంజీవికి కరోనా నెగిటివ్..

  • Published By: sreehari ,Published On : November 12, 2020 / 09:44 PM IST
చిరంజీవికి కరోనా నెగిటివ్..

Chiranjeevi tests Covid-19 negative : మెగా‌స్టార్ చిరంజీవికి కరోనా నెగిటివ్ వచ్చింది.. ఇటీవలే కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ అని వచ్చింది. ఇప్పుడు మరోసారి టెస్టు చేయించుకోగా చిరంజీవికి కరోనా నెగిటివ్‌గా తేలింది. వైద్య పరీక్షల్లో తనకు కరోనా నెగెటివ్‌ వచ్చిన విషయాన్ని చిరంజీవి స్వయంగా ట్విటర్‌లో అభిమానులతో షేర్ చేశారు.



కొన్ని రోజుల క్రితమే ఆయనకు కరోనా వచ్చినట్టు టెస్టుల్లో తేలింది. కానీ, ఎలాంటి కరోనా లక్షణాలు మాత్రం కనిపించలేదు. ఆచార్య మూవీ షూటింగ్ కోసం కరోనా టెస్టింగ్ చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణం అయింది. వెంటనే ఆయనకు అనుమానం వచ్చి వైద్యులను సంప్రదించారు. RT-PCR టెస్టులో చిరంజీవికి కరోనా లేదని తేలింది.



కరోనా నుంచి తాను తొందరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతిఒక్కరికి ఆయన ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవానికి ఆయనకు కరోనా సోకలేదని అంటున్నారు. ఫాల్టీ కిట్ వల్లే పాజిటివ్ అని వచ్చిందని చెబుతున్నారు.


‘కాలం, కరోనా గత నాలుగు రోజులుగా నన్ను కన్ఫూజ్ చేసి, నాతో ఆడేసుకున్నాయి. ఆదివారం టెస్టులో పాజిటివ్ రిపోర్టు అన్న తర్వాత బేసిక్ మెడికేషన్ స్టార్ట్ చేశాను. రెండు రోజులైన ఎక్కడా ఎలాంటి లక్షణాలు లేకపోయేసరికి, నాకే అనుమానం వచ్చింది. అపోలో డాక్టర్స్ ని అప్రోచ్ అయ్యాను. వాళ్లు అక్కడ CT స్కాన్ తీసి చెస్టులో ఎలాంటి ట్రేసెస్ లేవు అన్న నిర్ధారణకు వచ్చారు.



అక్కడ రిజల్ట్ నెగటీవ్ వచ్చాక మరోసారి.. మరోచోట నివృత్తి చేసుకుందామని నేను Tenet Labలో మూడు రకాల కిట్స్‌లతో టెస్టు చేయించాను. అక్కడా నెగటీవ్ వచ్చింది. ఫైనల్ గా ఆదివారం నాకు పాజిటివ్ అని రిపోర్టు ఇచ్చిన చోట కూడా RT PCR టెస్టు చేయించాను.



అక్కడ కూడా నెగటీవ్ వచ్చింది.. ఈ మూడు రిపోర్టులు తర్వాత మొదటి రిపోర్టు ‘ఫాల్టీ కిట్’ వలన వచ్చిందని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. ఈ సమయంలో మీరందరు చూపించిన ప్రేమాభిమానులకి, చేసిన పూజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ తెలియజేశారు.
Chiranjeevi tests Covid-19 negative