Ram Charan: చరణ్ మూవీలో మోహన్ లాల్ అలాంటి పాత్రలో కనిపిస్తాడా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ కాంబినేషన్ మూవీపై కేవలం సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘RC15’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్.

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ కాంబినేషన్ మూవీపై కేవలం సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘RC15’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్.
Ram Charan : మరో ఘనతను అందుకున్న మెగా పవర్ స్టార్..
ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండనుందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. కాగా, ఈ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ మోహన్ లాల్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన పాత్ర సినిమా సెకండాఫ్‌లో రానుందని.. ఆయన చేసేది ఓ పవర్‌ఫుల్ సీఎం పాత్ర అని చిత్ర వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. సీఎం పాత్ర ఈ సినిమా కథకు చాలా కీలకంగా ఉంటుందని.. అందుకే ఈ పాత్రలో పర్ఫెక్ట్ యాక్టర్ అయిన మోహన్ లాల్‌ను తీసుకున్నాడట స్టార్ డైరెక్టర్ శంకర్.
Ram Charan: ఫ్యాన్స్ ని నిరాశపరిచిన రాంచరణ్..RC15 గురించి షాకింగ్ న్యూస్!
కాగా, ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్న పాత్రల్లో నటించబోతున్నాడని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే నెట్టింట ఈ లుక్స్ లీక్ కావడంతో ఈ సినిమాలో ఆయన పాత్రలు ఎలా ఉండబోతున్నాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు.