Formula E Race : సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులతో హోరెత్తిన ఫార్ములా ఈ-రేస్..

ఫిబ్రవరి 11న జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ ప్రోగ్రాంలో అనేకమంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు వచ్చి సందడి చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ చూడటమే కాక ఇక్కడ ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ని కూడా వీక్షించి సందడి చేశారు.....................

Formula E Race : సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులతో హోరెత్తిన ఫార్ములా ఈ-రేస్..

movie and sports celebrities participated in formula E race in Hyderabad

Formula E Race :  ఇండియాలో మొట్ట మొదటిసారిగా ఫార్ములా-ఈ కార్ రేసింగ్ ఫిబ్రవరి 11 నుంచి మన హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ చుట్టూ దీనికోసం ట్రాక్ ఏర్పాటు చేసి, ప్రజలు కూర్చొని వీక్షించడానికి సీటింగ్ ఏర్పాటు చేసి దీన్ని గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ని హైదరాబాద్ లో జరిపేందుకు కొంత కాలంగా తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ కృషి చేశారు. ఇక ఈ రేసింగ్ ప్రోగ్రాం అందరికి రీచ్ అయ్యేలా చాలా మంది సినీ, క్రీడా ప్రముఖులతో ప్రమోషన్స్ చేయించింది ప్రభుత్వం. దీంతో చాలా మందిలో ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై ఆసక్తి నెలకొంది.

ఫిబ్రవరి 11న జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ ప్రోగ్రాంలో అనేకమంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు వచ్చి సందడి చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ చూడటమే కాక ఇక్కడ ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ని కూడా వీక్షించి సందడి చేశారు. రామ్ చరణ్, నాగార్జున, నాగ చైతన్య, నమ్రత, మహేష్ తనయుడు గౌతమ్, నారా బ్రాహ్మణి, ఎన్టీఆర్ భార్య ప్రణతి, పుల్లెల గోపీచంద్, సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, చాహల్, ఆనంద్ మహీంద్రా, సిద్ధూ జొన్నలగడ్డ, దుల్కర్ సల్మాన్, కిషన్ రెడ్డి, KTR, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్, అఖిల్.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు విచ్చేశారు.

Love Today : కోట్లు కురిపించిన చిన్న సినిమా.. 100 రోజుల లవ్ టుడే..

ఫార్ములా ఈ రేస్ ని సెలబ్రిటీలు ఆస్వాదించారు. మీడియాతో మాట్లాడారు. అభిమానులకు సెల్ఫీలు ఇచ్చారు. ఇక రామ్ చరణ్ సచిన్ ని కలిసి మాట్లాడటం, రామ్ చరణ్, ఆనంద్ మహీంద్రా కలిసి నాటు నాటు స్టెప్స్ వేయడం.. లాంటివి ఫ్యాన్స్ కి సంతోషాన్ని ఇచ్చింది.