Vikram: మురుగదాస్, విక్రమ్ డెడ్లీ కాంబినేషన్.. భారీ సినిమా ప్లాన్స్?

దక్షణాదిలో మరో క్రేజీ కాంబినేషన్ సినిమా మొదలు కాబోతుంది. తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరో విక్రమ్‌.

Vikram: మురుగదాస్, విక్రమ్ డెడ్లీ కాంబినేషన్.. భారీ సినిమా ప్లాన్స్?

Vikram

Vikram: దక్షణాదిలో మరో క్రేజీ కాంబినేషన్ సినిమా మొదలు కాబోతుంది. తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరో విక్రమ్‌. విక్రమ్ ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. పాత్రలు, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నా.. స్థాయికి మించి కష్టపడుతున్నా.. విక్రమ్‌కు సరైన హిట్‌ మాత్రం పడటం లేదు. ఈమధ్యే ఆయన తన తనయుడితో కలిసి మహాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Vikram : కమల్ హాసన్ సినిమాలో అమితాబ్??

ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న కోబ్రా సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటించబోయే తదుపరి చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. కమర్షియల్‌ కథలకు సందేశం జోడించి తెరకెక్కించటంలో తమిళ దర్శకుడు మురుగదాస్‌ సిద్ధహస్తుడు. ఈ క్రమంలో వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మురుగదాస్‌ చెప్పిన స్టోరీ లైన్‌ విక్రమ్‌కు నచ్చిందట.

Trivikram: త్రివిక్రమ్‌కు పోలసుల ఝలక్..!

భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించే సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మించనుండగా.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులపై మురుగదాస్‌ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. విక్రమ్‌ నటిస్తున్న ‘కోబ్రా’ మే 28న విడుదల కానుండగా, మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్‌ సెల్వన్‌’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.