Custody Movie: నాగచైతన్య కస్టడీ టీజర్ వచ్చేది అప్పుడే!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో చైతూ ఓ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేయగా, ఈ సినిమా నుండి మరిన్ని అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Custody Movie: నాగచైతన్య కస్టడీ టీజర్ వచ్చేది అప్పుడే!

Naga Chaitanya Custody Movie Teaser Date Locked

Custody Movie: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో చైతూ ఓ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేయగా, ఈ సినిమా నుండి మరిన్ని అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Custody Movie: ‘కస్టడీ’ డబ్బింగ్ మొదలుపెట్టిన నాగచైతన్య

కాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ చిత్ర టీజర్‌ను మార్చి 16న సాయంత్రం 4.51 గంటలకు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ మేరకు ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో విలక్షణ నటుడు అరవింద్ స్వామి పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రియమణి, సంపత్ రాజ్, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్, ప్రేమీ విశ్వనాథ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Custody: కస్టడీలోకి RX100 యాక్టర్.. ఎవరంటే..?

చైతూ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ కాగా, ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.