Naga Chaitanya : ఓటీటీలోకి నాగ చైతన్య.. హీరోగా.. విలన్‌గా..

ఇప్పటికే చైతూ మామ వెంకటేష్, రానా కూడా నెట్ ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. తాజాగా నాగ చైతన్య కూడా ఓ వెబ్ సిరీస్ కి ఒప్పుకున్నారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ సంస్థ...........

Naga Chaitanya : ఓటీటీలోకి నాగ చైతన్య.. హీరోగా.. విలన్‌గా..

Chaithu

Naga Chaitanya :   కరోనా తర్వాత ఓటీటీకి బాగా డిమాండ్ పెరిగింది. అనేక రకాల ఓటీటీ సంస్థలు కొత్త కొత్త కంటెంట్స్ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. సినీ పరిశ్రమకి చెందిన స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్స్, నిర్మాతలు సైతం ఓటీటీకి క్యూ కడుతున్నారు. ఓటీటీలలో సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తున్నారు. చాలా మంది టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా ఓటిటిలో నటిస్తున్నారు. ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య కూడా ఓటీటీ బాట పట్టారు. ఇప్పటికే చైతూ మామ వెంకటేష్, రానా కూడా నెట్ ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. తాజాగా నాగ చైతన్య కూడా ఓ వెబ్ సిరీస్ కి ఒప్పుకున్నారు.

ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ సంస్థ నాగ చైతన్యతో వెబ్ సిరీస్ ని నిర్మిస్తుంది. ఈ సిరీస్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ఉండబోతుంది. ఇందులో నాగ చైతన్య హీరోగా, విలన్ గా రెండు పాత్రల్లో చేయబోతున్నట్టు సమాచారం. ఒక పాత్రలో జర్నలిస్ట్ గా, మరోటి నెగెటివ్​ పాత్రలో చేయబోతున్నాడు. ఒకటి లేదా రెండు సీజన్స్ గా ఈ సిరీస్ రావొచ్చు. ఒక్కో సీజన్ కి 8 నుంచి 10 ఎపిసోడ్స్​ ఉంటాయని సమాచారం.

Kushboo Sundar : యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతున్న ఖుష్బూ..

ఇందులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఇటీవల వరుసగా లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో హిట్స్ కొట్టి నటనా పరంగా కూడా చాలా ఎదిగాడని ప్రూవ్ చేసుకున్నాడు చైతూ. ఈ సిరీస్ తో చైతూలో మరో కొత్త కోణాన్ని కచ్చితంగా చూడొచ్చు. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉండొచ్చు.