Nagarjuna : రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్‌లో 10వ సినిమా.. మళ్ళీ ఆధ్యాత్మికంగా??

లెజెండరీ దర్శకుడు రాఘవేంద్రరావు గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన మళ్ళీ మెగాఫోన్ పట్టనున్నట్టు సమాచారం. అది కూడా కింగ్ నాగార్జున తో...........

Nagarjuna : రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్‌లో 10వ సినిమా.. మళ్ళీ ఆధ్యాత్మికంగా??

Raghavendrarao

Raghavendrarao :  లెజెండరీ దర్శకుడు రాఘవేంద్రరావు గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన మళ్ళీ మెగాఫోన్ పట్టనున్నట్టు సమాచారం. అది కూడా కింగ్ నాగార్జున తో. డైరెక్టర్ రాఘవేందర్ రావు, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో ఇప్పటి వరకు 9 సినిమాలొచ్చాయి. అందులో నాలుగు భక్తిరస చిత్రాలే. వీరిద్దరి కలయికలో మరో డివోషనల్ సినిమా రానుంది అని సమాచారం. అందులో నాగార్జున క్యారెక్టర్ భక్తుడా, భగవంతుడా, అనేది త్వరలో రివీల్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే 9 సినిమాలు చేసిన వీళ్ల ఇద్దరి కాంబోలో 10వ సినిమా ఖచ్చితంగా ఉంటుందని, స్పీడ్ గా స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందనేది టీమ్ నుంచి అందుతున్న సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు.

రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ సినిమాలు చేస్తున్న నాగార్జునను అన్నమయ్యగా మలచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు రాఘవేంద్ర రావు. అన్నమయ్య నాగార్జునకే కాదు, రాఘవేంద్రరావుకూ తొలి డివోషనల్ సినిమా. 15వ శతాబ్ధపు వాగ్గేయ కారుడు, అన్నమయ్య జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించి, చరిత్రలో నిలిచిపోయింది. నాగార్జునకు, రాఘవేందరావుకే కాదు, ఈ సినిమా టీమ్ అందరికీ మంచి పేరు తీసుకొచ్చింది.

Tammareddy Bharadwaj : పాన్ ఇండియా సినిమాలకి వందల కోట్లు ఎందుకు? మేజర్ సినిమా చూసి నేర్చుకోండి..

అదే పరంపర కొనసాగిస్తూ అన్నమయ్య తర్వాత వీళ్ల కాంబోలో వచ్చిన మరో సినిమా శ్రీరామదాసు. అది కూడా అద్భుమైన విజయం సాధించింది. ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి బాక్సాఫీస్ ముందు విజయం సాధించింది. వీళ్ల కాంబినేషన్ లో 8వ సినిమాగా శ్రీ శిరిడీసాయి, 9వ సినిమాగా ఓం నమో వెంకటేశాయ సినిమాలు వచ్చాయి కాని ఇవి అన్నమయ్య, శ్రీరామదాసు రేంజ్ లో విజయం సాధించలేకపోయాయి. దాదాపు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత వీళ్ల కాంబినేషన్ లో 10వ సినిమా వస్తుందనే సమాచారం రావడంతో ఈ సినిమాల అభిమానులు, నాగార్జున ఫ్యాన్స్ అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.