Bigg Boss 5: బిగ్ బాస్ తర్వాత ఇంట్లో వినిపించే గొంతు కాజల్‌దే

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 తుది దశకు చేరుకుంటోంది. టాస్క్ ల విషయంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న బిగ్ బాస్ సీజన్ మొదలైన కొత్తలో ఏ మాత్రం ఈ సీజన్ బాగాలేదని టాక్..

10TV Telugu News

Bigg Boss 5: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 తుది దశకు చేరుకుంటోంది. టాస్క్ ల విషయంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న బిగ్ బాస్ సీజన్ మొదలైన కొత్తలో ఏ మాత్రం ఈ సీజన్ బాగాలేదని టాక్ ను మెల్లగా దూరం చేసుకుంటూ చివరికి ఎన్ని విమర్శలు వచ్చినా ఈ సీజన్ సక్సెస్ దిశగా ఫైనల్ గా చేరుకుంటుంది. నాగార్జున హోస్టింగ్ మీద కూడా కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ మెల్లగా ఎపిసోడ్స్ పెరిగేకొద్దీ నాగ్ కూడా సెట్ అయ్యారు. ఇక ఈ వారం విషయానికి వస్తే ఎప్పటి లాగే శనివారం ఎపిసోడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ తో కాసేపు ముచ్చట్లు పెట్టారు.

Bollywood Film Release: 6 నెలలు.. 3 వేలకోట్లు.. ఇదీ బాలీవుడ్ టార్గెట్!

వస్తూనే కంప్లెయింట్‌ బాక్స్‌ తీసుకొచ్చిన నాగ్ హౌస్‌లో ఎవరి మీద ఎవరికి ఫిర్యాదులు ఉన్నాయో వాటిని చెప్పి వాటిని అందులో వేయమన్నారు. ముందుగా సిరిని నాగార్జున అడగ్గా.. షణ్ముఖ్ వైపు చూపించింది. దానికి షణ్ముఖ్ ‘అసలు నేనేం చేశాను సార్’ అంటూ పైకి లేవగా.. ‘ఏం చేయడమేంటి..? సిరి కోసం సరిగ్గా ఆడకుండా, శ్రీరామ్ కోసం ఆడి’ అని నాగ్ అనడంతో హౌస్ మేట్స్ అంతా నవ్వేశారు. ఆ తర్వాత నాగార్జున సిరితో ‘నువ్వు ఫ్రెండ్ అయినందుకు సిగ్గుపడుతున్నా అన్నాడు కదా..’ అంటూ షణ్ముఖ్ కి సెటైర్ వేశారు.

Bigg Boss 5: నో డౌట్ ఈరోజు పింకీ ఎలిమినేషన్ ఖాయం!

ఒకవైపు షణ్ముఖ్ ను ఆట పట్టిస్తూనే సిరి పరువు తీసేశాడు. షణ్ముఖ్ ఏం చేసినా నువ్వు ఫ్రెండ్లీ హగ్ ఇస్తూనే ఉన్నావుగా అంటూ సిరికి ఓ కామెంట్ విసిరాడు నాగ్. ఆ తర్వాత కాజల్ సన్నీమీద కంప్లైంట్ చేసింది. ‘ఏం మాట్లాడినా.. ఏం చెప్పినా.. ఆత్రం, ఆత్రం.. ఆగు ఆగు అంటూ’ తనపై అరుస్తున్నాడని కాజల్ చెప్పగా సన్నీ.. సారీ చెప్పడానికి రెడీ అయ్యాడు. సారీ సర్ అంటే కాజల్ కు చెప్పమన్నారు. ఇక ‘సారీ చెప్పేసి.. టిష్యూ పేపర్ నీ ఫేస్ పై వేసిన విషయాన్ని కూడా మర్చిపో.. బాగా తుడిచి మరీ వేసింది’ అంటూ నాగార్జున కామెంట్ తో కాజల్ ఆ అని అనగా.. నాగ్ దాన్ని కూడా ఇమిటేట్ చేశాడు.

NBK’s Unstoppable: మరో బ్లాక్ బస్టర్ ఎపిసోడ్.. బాలయ్య షోలో మహేష్!

మొత్తంగా ఈ ఎపిసోడ్ లో నాగార్జున గతంలో ఫ్యామిలీ మెంబర్స్‌ కోసం హౌస్‌మేట్స్‌ త్యాగాలు చేసిన సామానంతా తిరిగి ఇచ్చేయగా సిరి, ప్రియాంక వస్తువులకు మాత్రం మిగతా హౌస్‌మేట్స్‌ త్యాగం చేయాలని మెలిక పెట్టాడు. హౌస్‌లో ఎవరు ఉండటానికి అర్హత ఉందనుకుంటున్నారో వారికే త్యాగం చేయాలంటూ.. తులాభారంలో సిరి, ప్రియాంకలలో ఎవరి వైపు ఎక్కువ బరువు తూగితే వారు త్యాగం చేసిన వస్తువు తిరిగొస్తుందన్నాడు. దీంతో సన్నీ, మానస్‌ పింకీకి సపోర్ట్‌ చేయగా మిగతావాళ్లు సిరికి సపోర్ట్‌ చేశారు. అలా సిరికి శ్రీహాన్‌ ఆమెకిచ్చిన గిఫ్ట్‌ తిరిగి వచ్చింది. ఇక, శ్రీరామ్‌ ఫైనల్ కి చేరగా.. మానస్‌, సిరి, కాజల్‌, ప్రియాంకలలో ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

×