Nandamuri Mokshagna : బావతో మోక్షజ్ఞ సరదా ముచ్చట్లు.. నారా వారి పల్లెలో సంక్రాంతి సంబరాలు..

నందమూరి కుటుంబం, నారా కుటుంబం కలిసి నారా వారి పల్లెలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. వీరిని చూసేందుకు అభిమానులు నారా వారి పల్లె చేరుకుంటున్నారు. ఇక ఈ సంక్రాంతి సంబరాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా అందర్నీ ఆకట్టుకుంటున్న దృశ్యం బావ బావమరిదలు ముచ్చట్లు.

Nandamuri Mokshagna : బావతో మోక్షజ్ఞ సరదా ముచ్చట్లు.. నారా వారి పల్లెలో సంక్రాంతి సంబరాలు..

Nandamuri Mokshagna with nara lokesh

Nandamuri Mokshagna : నందమూరి కుటుంబం, నారా కుటుంబం కలిసి నారా వారి పల్లెలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక వీరిని చూసేందుకు అభిమానులు నారా వారి పల్లె చేరుకుంటున్నారు. దీంతో నారా వారి పల్లెలో సందడి వాతావరణం నెలకుంది. కాగా ఇరు కుటుంబాలు గ్రామంలోని గంగమ్మ కట్ట, నాగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులు అర్పించారు. అలాగే గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు ఘటించారు.

Balakrishna : దేవబ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పిన బాలయ్య..

ఇక ఈ సంక్రాంతి సంబరాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా అందర్నీ ఆకట్టుకుంటున్న దృశ్యం బావ బావమరిదలు ముచ్చట్లు. బావ లోకేష్ తో కలిసి బావమరిది మోక్షజ్ఞ సరదాగా మాట్లాడుతూ నవ్వుతున్న వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మోక్షజ్ఞ కూడా చాలా రోజులు తరువాత బయట కనిపించడంతో నందమూరి అభిమానులు స్టేటస్ లు పెడుతూ వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఏడాది మోక్షజ్ఞ సినీ అరంగేట్రం ఉండబోతున్నట్లు బాలకృష్ణ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ విషయం గురించి గోవా ఫిలిం ఫెస్టివల్ లో ప్రశ్నించారు. మోక్షజ్ఞ ఎంట్రీ బోయపాటి దర్శకత్వంలో ఉండబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి నిజమేనా? అని క్యూస్షన్ చేశారు. దీనికి బాలకృష్ణ.. ఎవరి డైరెక్షన్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు అంటూ బదులిచ్చాడు. కాగా బాలకృష్ణ ‘ఆదిత్య 369’ సినిమాకి రీమేక్ తీసుకు వస్తాను అని చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాని తనే డైరెక్ట్ చేస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాలో హీరోగా మోక్షజ్ఞ చేయబోతున్నాడు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి తన కొడుకుని తన దర్శకత్వంలోనే లాంచ్ చేస్తాడా అనేది చూడాలి.