Narendra Modi : స్పెషల్ మూమెంట్.. ప్రతి ఇండియన్ గర్వపడేలా చేశారు.. RRR టీంపై ప్రధాని మోదీ పోస్ట్..

తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీరవాణి, చిత్రయూనిట్ ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. RRR ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చేసిన కీరవాణి పేరు అనౌన్స్ వీడియోని షేర్ చేసి..........

Narendra Modi : స్పెషల్ మూమెంట్.. ప్రతి ఇండియన్ గర్వపడేలా చేశారు.. RRR టీంపై ప్రధాని మోదీ పోస్ట్..

Narendra Modi :  రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ సినిమా RRR ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇండియాతో పాటు విదేశాల్లో కూడా భారీ విజయం సాధించి మంచి కలెక్షన్స్ ని కూడా సాధించింది. ఇప్పటికే RRR సినిమాకి అంతర్జాతీయవేదికగా అవార్డులు వస్తున్నాయి. ఇటీవల హాలీవుడ్ లో ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మిక అవార్డు అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR
రెండు విభాగాల్లో నామినేట్ అవ్వగా తాజాగా ఈ అవార్డ్స్ ని ప్రకటించారు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు లభించింది. ఈ పాటకి సంగీతం అందించిన సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డుని అంతర్జాతీయ వేదికపై అందుకున్నారు. దీంతో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా నెటిజన్లు, అభిమానులు, పలువురు ప్రముఖులు కీరవాణికి, చిత్రయూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు. దేశవ్యాప్తంగా సినిమా ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా అభినందిస్తున్నారు.

Rajamouli : RRR విజయం నమ్మలేనిది.. ఫారినర్స్ RRRని ఎందుకు అంత ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను..

తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీరవాణి, చిత్రయూనిట్ ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. RRR ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చేసిన కీరవాణి పేరు అనౌన్స్ వీడియోని షేర్ చేసి.. ఇది చాలా ప్రత్యేకమైన పురస్కారం. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్ లకు అభినందనలు. అలాగే రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ మరియు మొత్తం చిత్ర బృందంకి కూడా అభినందనలు. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వపడేలా చేస్తుంది అని నరేంద్రమోదీ పోస్ట్ చేశారు. దేశ ప్రధాని కూడా RRR సినిమా యూనిట్ ని అభినందిస్తూ పోస్ట్ చేయడంతో చిత్రయూనిట్ తో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.