బాలయ్య ‘సింహా’ గర్జనకు 9ఏళ్ళు

2010 ఏప్రిల్ 30న రిలీజ్ అయ్యింది సింహా.. 2019 ఏప్రిల్ 30 నాటికి బాక్సాఫీస్ వద్ద బాలయ్య సింహ గర్జనచేసి 9 సంవత్సరాలు అవుతుంది..

  • Published By: sekhar ,Published On : April 30, 2019 / 07:20 AM IST
బాలయ్య ‘సింహా’ గర్జనకు 9ఏళ్ళు

2010 ఏప్రిల్ 30న రిలీజ్ అయ్యింది సింహా.. 2019 ఏప్రిల్ 30 నాటికి బాక్సాఫీస్ వద్ద బాలయ్య సింహ గర్జనచేసి 9 సంవత్సరాలు అవుతుంది..

లక్ష్మీనరసింహ తర్వాత రిలీజ్ అయిన ప్రతీ సినిమా ఫ్లాపే.. బాలకృష్ణ, ఆయన అభిమానుల అయోమయంలో ఉన్నారు. ఇక బాలకృష్ణ పని అయిపోంది.. అన్నారందరూ.. సరిగ్గా ఆ టైమ్‌లో అప్పటికి దర్శకుడిగా  రెండు సినిమాల అనుభవం ఉన్న బోయపాటి లైన్‌లోకి వచ్చాడు. బాబూ, నేనూ మీ అభిమానినే, ఆడియన్స్ ఆదరించే, అభిమానులు గర్వపడే సినిమా తీస్తా.. అని మాటిచ్చాడు.. ప్రొడ్యూసర్‌గా సరైన హిట్‌లేని పరుచూరి శివరాం ప్రసాద్ తన కొడుకు పరుచూరి కిరీటిని నిర్మాతగా పెట్టి, సింహాని పట్టాలెక్కించాడు.. 2010 ఏప్రిల్ 30న రిలీజ్ అయ్యింది సింహా. బెన్‌ఫిట్ షో నుండీ ఒకటే టాక్.. బాలయ్య ఈజ్ బ్యాక్.. అని… సింహాగా బాక్సాఫీస్ దగ్గర జూలు విదిల్చాడు నటసింహ నందమూరి బాలకృష్ణ..

అప్పటి వరకు ఎవరూ చూడని సరికొత్త బాలయ్యని, రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో చూపించి బోయపాటి శభాష్ అనిపించుకున్నాడు. అప్పటినుండి బాలయ్య అభిమానులకు అభిమాన దర్శకుడయ్యాడు. బాలయ్య ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, చక్రి సాంగ్స్, చిన్నా ఆర్ఆర్, ఆర్థర్ ఎ.విల్సన్ ఫోటోగ్రఫీ సినిమాని వేరే లెవల్‌కి తీసుకెళ్ళాయి. ఈ సినిమాకి గానూ ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు బాలయ్య.. ఉత్తమ సంగీత దర్శకుడిగా చక్రిని నంది వరించింది. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ లాభాలు చవిచూసారు.

తెలుగు సినీ చరిత్రలో 230 పైగా కేంద్రాలలో 50 రోజులు ఆడిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. 92 సెంటర్స్‌లో 100 రోజులు, 3 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకున్న చివరి సినిమా కూడా సింహానే కావడం విశేషం. 2019 ఏప్రిల్ 30 నాటికి బాక్సాఫీస్ వద్ద బాలయ్య సింహ గర్జనచేసి 9 సంవత్సరాలు అవుతుంది. బాలయ్య అండ్ బోయపాటి కెరీర్‌లో, నందమూరి అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది సింహా.

వాచ్, సింహమంటి చిన్నోడే వీడియో సాంగ్..