Nayan-Vignesh : సెకండ్ హనీమూన్‌కి చెక్కేసిన నయన్, విగ్నేష్.. ఈ సారి స్పెయిన్‌లో..

నయన్ ప్రస్తుతం షారుఖ్ తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తుంది. ఇక విగ్నేష్ అజిత్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దీంతో గత రెండు నెలలుగా వీరిద్దరు బిజీబిజీగా ఉన్నారు. తాజాగా వర్క్ నుంచి కొంచెం ఫ్రీ దొరకగానే ఇద్దరూ సెకండ్ హనీమూన్ కి...........

Nayan-Vignesh : సెకండ్ హనీమూన్‌కి చెక్కేసిన నయన్, విగ్నేష్.. ఈ సారి స్పెయిన్‌లో..
ad

 

Nayan-Vignesh :  స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్‌‌ని గత కొనేళ్ళుగా ప్రేమించి ఇటీవల జూన్‌ 9న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత హనీమూన్‌కి థాయిలాండ్ వెళ్లారు ఈ కొత్త దంపతులు. దాదాపు వారం రోజులు థాయిలాండ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. థాయిలాండ్ లో ఈ కొత్త దంపతులు ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ డైరెక్టర్ విగ్నేష్ సోషల్ మీడియా ద్వారా కూడా పంచుకున్నాడు. థాయ్‌లాండ్‌ నుంచి తిరిగిరాగానే ఇద్దరూ షూట్స్ లో బిజీ అయిపోయారు.

నయన్ ప్రస్తుతం షారుఖ్ తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తుంది. ఇక విగ్నేష్ అజిత్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దీంతో గత రెండు నెలలుగా వీరిద్దరు బిజీబిజీగా ఉన్నారు. తాజాగా వర్క్ నుంచి కొంచెం ఫ్రీ దొరకగానే ఇద్దరూ సెకండ్ హనీమూన్ కి చెక్కేశారు. నయన్-విగ్నేష్ కి ప్రైవేట్ జెట్ ఉన్న సంగతి తెలిసిందే. తమ ప్రైవేట్ జెట్ లో స్పెయిన్ లోని బార్సిలోనాకి వెళ్లినట్టు తెలుస్తుంది.

Pawan Kalyan : ‘కళాపురం’ కోసం పవన్ కళ్యాణ్.. చిన్న సినిమా కోసం వచ్చి నిజంగానే పవర్ స్టార్ అనిపించుకున్నారు..

ప్రైవేట్ జెట్ లో నయన్-విగ్నేష్ చాలా క్లోజ్ గా సెల్ఫీలు తీసుకొని ఆ ఫోటోలని విగ్నేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలని షేర్ చేస్తూ.. ”ఇన్ని రోజులు వర్క్ తో బిజీగా ఉన్నాము. ఇప్పుడే ఫ్రీ అయ్యాము. ఇప్పుడు మా కోసం సమయం కేటాయించుకుంటున్నాము. నా భార్యతో కలిసి బార్సిలోనాకి వెళ్తున్నాను” అని పోస్ట్ చేశాడు విగ్నేష్. దీంతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.