Nayan-Vignesh : సరోగసి వివాదం.. నయనతార దంపతులు జైలుకెళ్లాల్సిందేనా??

నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం పిల్లలు ఎలా పుట్టారో వివరాలు చెప్పాలని వీరికి నోటీసులు పంపించింది. మన దేశంలో సరోగసి ద్వారా పిల్లలు కనాలంటే.............

Nayan-Vignesh : సరోగసి వివాదం.. నయనతార దంపతులు జైలుకెళ్లాల్సిందేనా??

Nayanatara and Vignesh Shivan in Surrogacy Issue

Nayan-Vignesh :  స్టార్ హీరోయిన్ నయనతార ఇటీవల దర్శకుడు విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లయి నాలుగు నెలలు కాకముందే ఇటీవల మాకు కవల పిల్లలు పుట్టారు అని అధికారికంగా ప్రకటించారు. దీంతో కొంతమంది ఆశ్చర్యపోతుంటే, మరికొంతమంది ఎలా పుట్టారు అని ఆరా తీస్తున్నారు. అయితే సరోగసి ద్వారానే పిల్లలు పుట్టినట్టు సమాచారం.

దీంతో నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం పిల్లలు ఎలా పుట్టారో వివరాలు చెప్పాలని వీరికి నోటీసులు పంపించింది. మన దేశంలో సరోగసి ద్వారా పిల్లలు కనాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. కానీ చాలా మంది పిల్లలు లేని వాళ్ళు ఈ రూల్స్ ఫాలో అవ్వకుండానే ఇల్లీగల్ గా సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కంటారు. ఇప్పుడు నయన్ దంపతులు కూడా ఇలాగే కన్నారని అంతా అభిప్రాయపడుతున్నారు. సెలబ్రిటీలు కావడంతో, వారు ఈ విషయాన్ని అధికారికంగా పోస్ట్ చేయడంతో ఇది వివాదంగా మారింది.

Manchu Vishnu : RRR చెత్త సినిమా అన్న తమిళ్ నెటిజన్.. కౌంటర్ ఇచ్చిన మంచు విష్ణు..

మనదేశంలో సరోగసి చట్టం ప్రకారం పెళ్లయిన ఐదు సంవత్సరాల వరకు కూడా పిల్లలు పుట్టకపోతే అప్పుడు ఈ పద్దతిని ఎంచుకోవాలి, అంతే కాక మరిన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ అతిక్రమించి ఇల్లీగల్ గా సరోగసి ద్వారా పిల్లల్ని పుట్టించినట్టు రుజువైతే ఇందుకు బాధ్యులైనవారికి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది. మరి తమిళనాడు ప్రభుత్వం అడిగిన దానికి నయన్ దంపతులు వివరణ ఇస్తారా? లేక శిక్షార్హులు అవుతారా అని అంతా చర్చిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు నయన్ దంపతులు మాత్రం స్పందించలేదు.