Nayan-Vignesh : పెళ్లి పనులు మొదలు పెట్టిన నయన్-విగ్నేష్?? గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్న కోలీవుడ్ జంట..

ఇటీవల నయనతార-విఘ్నేష్‌ శివన్‌ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న అని, జూన్‌ 9న ఈ జంట తిరుమలలో వివాహం చేసుకోబోతున్నారని సమాచారం...................

Nayan-Vignesh : పెళ్లి పనులు మొదలు పెట్టిన నయన్-విగ్నేష్?? గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్న కోలీవుడ్ జంట..

Nayanatara

Nayan-Vignesh :  స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. గతంలో కూడా గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగారు. గత కొంతకాలంగా ఇద్దరూ కలిసి ఒకేచోట నివసిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. ఇక వీరి పెళ్లిపై చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి.

అయితే ఇటీవల నయనతార-విఘ్నేష్‌ శివన్‌ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న అని, జూన్‌ 9న ఈ జంట తిరుమలలో వివాహం చేసుకోబోతున్నారని సమాచారం అందింది. దీనిపై వీరిద్దరూ అధికారికంగా ప్రకటన ఇవ్వకపోయినా తమిళ మీడియా నుంచి వార్తలు వస్తున్నాయి. ఇటీవల తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకొని, తమ పెళ్లి గురించి, ఏర్పాట్ల గురించి కూడా అక్కడి అధికారులతో మాట్లాడినట్టు తెలుస్తుంది.

Read :   తెలుగు సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసిన హీరోలు

తాజాగా ఈ జంట మరోసారి గుళ్ళు, గోపురాల చుట్టూ తిరిగేస్తున్నారు. ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయన్-విగ్నేష్ తాజాగా తిరుచ్చిలోని శ్రీరంగం వెళ్లి శ్రీరంగనాథున్ని దర్శించుకున్నారు. అనంతరం తంజావూరు జిల్లా అయ్యంపేట సమీపంలోని పళత్తూర్‌ గ్రామానికి వెళ్లిన దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ వారి కులదైవం కంచి కామాక్షి అమ్మవారిని దర్శించి పాలు పొంగించి, విశేష పూజలు చేశారు. దీంతో మరోసారి వీరి పెళ్లి వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.