Bigg Boss 7: బిగ్‌బాస్ 6 ముగిసింది.. ఇక బిగ్‌బాస్ 7 లొల్లి షురూ..?

తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్‌బాస్ ఎలాంటి సెక్సెస్‌ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా బిగ్‌బాస్ 6 సీజన్ కూడా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యి గ్రాండ్ ఫినాలేతో ఈ సీజన్‌ను ఫినిష్ చేసుకుంది. బిగ్‌బాస్ 6 విజేతగా సింగర్ రేవంత్ నిలిచాడు. ఇక ఈ సీజన్ సక్సెస్‌ఫుల్‌గా ముగియడంతో షో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Bigg Boss 7: బిగ్‌బాస్ 6 ముగిసింది.. ఇక బిగ్‌బాస్ 7 లొల్లి షురూ..?

News About Bigg Boss 7 Doing Rounds In Social Media

Bigg Boss 7: తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్‌బాస్ ఎలాంటి సెక్సెస్‌ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా బిగ్‌బాస్ 6 సీజన్ కూడా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యి గ్రాండ్ ఫినాలేతో ఈ సీజన్‌ను ఫినిష్ చేసుకుంది. బిగ్‌బాస్ 6 విజేతగా సింగర్ రేవంత్ నిలిచాడు. ఇక ఈ సీజన్ సక్సెస్‌ఫుల్‌గా ముగియడంతో షో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Bigg Boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 విన్నర్ ‘రేవంత్’.. అఫీషియల్ సైట్‌లో అనౌన్స్..

సోషల్ మీడియాలో కూడా బిగ్‌బాస్ 6 పూర్తవడంతో ఇకపై రోజూ బిగ్‌బాస్‌కు సంబంధించిన వార్తలు ఉండవని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇలా బిగ్‌బాస్ 6 ముగిసిందో లేదో, అప్పుడే బిగ్‌బాస్ 7 గురించి నెట్టింట పలు వార్తలు దర్శనమిస్తున్నాయి. ఈసారి బిగ్‌బాస్ 6 చాలా తక్కువ ప్రాధాన్యతను సంతరించుకుందని.. ఈ షోను ఎక్కువ మంది చూడలేదని.. ఇలా పలు వార్తలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కాగా, తాజాగా బిగ్‌బాస్ 7కు హోస్ట్ మారబోతున్నారని.. నాగార్జున ఇక బిగ్‌బాస్‌కు గుడ్ బై చెప్పాడనే వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Bigg Boss 6 : బిగ్‌బాస్ ఫైనల్లో ‘ధమాకా’ సందడి..

బిగ్‌బాస్ 7కు హోస్ట్‌ను మార్చాలని నిర్వాహకులు కూడా భావిస్తున్నారని.. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ 7కు నందమూరి బాలకృష్ణను హోస్ట్‌గా ఫిక్స్ చేయాలని నిర్వాహకులు భావించారని.. అయితే యంగ్‌స్టర్స్ ఎక్కువగా చూసే షో కాబట్టి ఎవరైనా యంగ్ హీరోను పెట్టాలని వారు నిర్ణయం మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో బిగ్‌బాస్ 7కు విజయ్ దేవరకొండ లేదా రానా దగ్గుబాటి లాంటి యంగ్ హీరోలైతే తమ షో క్రేజ్ అమాంతం పెరిగిపోతుందని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. మరి బిగ్‌బాస్ 7 గురించి అప్పుడే నెట్టింట వార్తలు వస్తుండటంతో ఈసారి బిగ్‌బాస్ 7 కోసం నిర్వాహకులు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారో చూడాలి.