Kumari Srimathi : బార్ పెడుతున్న నిత్యామీనన్.. డాక్టర్ బాబు కూడా.. కుమారి శ్రీమతి ట్రైలర్ చూశారా?

నిత్యామీనన్ ముఖ్య పాత్రలో రాబోతున్న సిరీస్ కుమారి శ్రీమతి. తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ తెరకెక్కిస్తున్నాయి ఈ సినిమాని. ఈ సిరీస్ డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది.

Kumari Srimathi : బార్ పెడుతున్న నిత్యామీనన్.. డాక్టర్ బాబు కూడా.. కుమారి శ్రీమతి ట్రైలర్ చూశారా?

Nithya Menen Kumari Srimathi Series Trailer Released

Updated On : September 22, 2023 / 8:10 PM IST

Kumari Srimathi Trailer : నిత్యామీనన్ ముఖ్య పాత్రలో రాబోతున్న సిరీస్ కుమారి శ్రీమతి. తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ తెరకెక్కిస్తున్నాయి ఈ సినిమాని. ఈ సిరీస్ డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. నిత్యామీనన్, తిరువీర్, గౌతమి, కార్తీకదీపం డాక్టర్ బాబు ఫేమ్ నిరుపమ్ పరిటాల.. ఇలా పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తన తాత కట్టించిన ఇల్లుని దక్కించుకునేదాకా పెళ్లి చేసుకోను అనే హీరోయిన్, ఆమె కోసం వెనకపడే హీరో, ఆ ఇల్లు కావాలంటే 38 లక్షలు కావాలనడంతో ఆ డబ్బుల కోసం బార్ పెట్టడానికి రెడీ అవుతుంది నిత్యామీనన్. ట్రైలర్ లో కామెడీ, ఎమోషన్ బాగా ఉండబోతున్నట్టు చూపించారు. ట్రైలర్ తో ఈ సిరీస్ పై ఆసక్తి నెలకొంది.

Also Read : Manchu Manoj : మనోజ్ అయిపోయాడు అన్నారు.. భరించాను.. తిరిగొస్తున్నా.. మంచు మనోజ్ కొత్త షో ప్రోమో చూశారా?

ఇక సీరియల్ స్టార్ అయిన డాక్టర్ బాబు ఇందులో నటిస్తుండటంతో బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఈ సిరీస్ చూసే అవకాశం ఉంది. స్వప్న సినిమాస్ అన్ని హిట్ సినిమాలే తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ కూడా ఓటీటీలో బాగా అరిచి అవుతుందని భావిస్తున్నారు. కుమారి శ్రీమతి సిరీస్ సెప్టెంబర్ 28 నుంచి అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది.