Bigg Boss 5 : బిగ్ బాస్ ప్రియాంకకి సపోర్ట్ ఇవ్వం : తెలంగాణ ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ

తాజాగా ప్రియాంక సింగ్‌ ఎవరో తనకు తెలీదని, బిగ్ బాస్ లో ఆమెకు సపోర్ట్‌ చేయమని తెలంగాణ రాష్ట్ర హిజ్రా ఫౌండర్‌ చంద్రముఖి కామెంట్స్‌ చేశారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ ప్రియాంకకి సపోర్ట్ ఇవ్వం : తెలంగాణ ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ

Priyanka

Bigg Boss 5 :  తెలుగు బిగ్ బాస్ లో ఒక ట్రాన్స్‌జెండర్‌ ఉండేలా చూస్తున్నారు నిర్వాహకులు. గతంలో తమన్నా సింహాద్రి బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసింది. ఈ సీజన్ లో ప్రియాంక సింగ్ ట్రాన్స్‌జెండర్‌ గా పార్టిసిపేట్ చేస్తుంది. కామెడీ షోలో లేడీ గెటప్స్‌ వేసిన సాయి తేజ ఆ తర్వాత ఆపరేషన్‌ చేయించుకుని అమ్మాయిగా మారిపోయాడు. ప్రియాంక సింగ్‌గా పేరు మార్చుకున్న సాయికి బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ఈ ఐదో సీజన్‌లో పాల్గొంటున్నాడు.

Rana : ఏం టైంపాస్ గాళ్ళు రా మీరు.. మరోసారి ఫేక్ న్యూస్ పై రానా సెటైర్

తాజాగా ప్రియాంక సింగ్‌ ఎవరో తనకు తెలీదని, బిగ్ బాస్ లో ఆమెకు సపోర్ట్‌ చేయమని తెలంగాణ రాష్ట్ర హిజ్రా ఫౌండర్‌ చంద్రముఖి కామెంట్స్‌ చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చంద్రముఖి మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్‌గా మారడం అంటే అంత ఈజీ కాదు. నాలో అమ్మాయి లక్షణాలు ఉన్నాయని సైక్రియాట్రిస్ట్‌కు చెప్తే అతడు ఓ రెండేళ్లపాటు ఆడపిల్లలా బట్టలు వేసుకోమంటాడు. రెండేళ్లు కౌన్సిలింగ్‌ ఇస్తాడు. దీని తర్వాత కూడా అమ్మాయిగానే ఉండాలనిపిస్తే అప్పుడు సర్జరీ చేయించుకోమని చెప్తారు. అంతేకానీ 24 గంటలు చీర కట్టుకొని బాడీలో ఫెమినిటీని పెంచుకోవడం వేరు, పుట్టినప్పుడే ఫెమినిటీతో పుట్టడం వేరు. కొందరు ఆడపిల్ల గెటప్స్‌ వేస్తే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని పూర్తిగా ఆడపిల్లగా మారి ఇంకా ఎక్కువ సంపాదిద్దాం అనుకుంటారు అని వ్యాఖ్యలు చేశారు.

Hyper Aadi : ఇలాంటి ఫేక్ న్యూస్ రాసే వాళ్ళందర్నీ.. సైలెంట్ గా హైపర్ ఆది సెటైర్

ఇటీవల బిగ్‌బాస్‌ షోలోకి ట్రాన్స్‌జెండర్లను తీసుకొస్తున్నారు. గతంలో తమన్నా, ఈసారి ప్రియాంకను తెచ్చారు. అయితే ప్రియాంక గురించి నాకు పెద్దగా తెలీదు. కేవలం టీవీలో చూడటం వరకే, అది కూడా సాయిగానే తెలుసు. తను ట్రాన్స్‌జెండర్‌ అయ్యారని నాకు తెలియదు. మా కమ్యూనిటీలో ఉండి ఉంటే మా సపోర్ట్‌ ఉండేది. లేదు కాబట్టి ఎటువంటి సపోర్ట్‌ ఉండదు. గతంలో తమన్నా బిగ్‌బాస్‌కు వెళ్లినప్పుడు సపోర్ట్‌ చేశాము. ఎందుకంటే ఆమె మా కమ్యూనిటీలో ఉంది. ఇప్పటికీ తమన్నా, నేను మంచి స్నేహితులం అని తెలిపారు చంద్రముఖి.

RC 15 : 7 నిమిషాల కోసం 70 కోట్లు.. రామ్ చరణ్ తో శంకర్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ..

బిగ్ బాస్ లో మానస్ వెనక తిరుగుతూ గేమ్ లో అంతంత మాత్రంగా ఉండే ప్రియాంకకి ట్రాన్స్‌జెండర్స్ కూడా సపోర్ట్ చేయకపోతే త్వరలోనే ఎలిమినేట్ అవ్వడం ఖాయం అని కామెట్లు చేస్తున్నారు.