KTR : కేటీఆర్‌ గారు.. ఇవి చూసేయండి.. కేటీఆర్‌ ట్వీట్ కి రిప్లైలు ఇస్తున్న ఓటీటీలు

ఇటీవల రెండు రోజుల క్రితం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఎడమ కాలికి గాయమైన విషయం తెలిసిందే. వైద్యులు కేటీఆర్‌ ని మూడు వారాలపాటు రెస్ట్ తీసుకోమని చెప్పారు. దీంతో కేటీఆర్‌..........

KTR : కేటీఆర్‌ గారు.. ఇవి చూసేయండి.. కేటీఆర్‌ ట్వీట్ కి రిప్లైలు ఇస్తున్న ఓటీటీలు

Ktr

OTTs : ఇటీవల రెండు రోజుల క్రితం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఎడమ కాలికి గాయమైన విషయం తెలిసిందే. వైద్యులు కేటీఆర్‌ ని మూడు వారాలపాటు రెస్ట్ తీసుకోమని చెప్పారు. దీంతో కేటీఆర్‌ ఈ సమయంలో ఖాళీగా ఉండటం ఎందుకు అని, మంచి సినిమాలు చూద్దామని భావించి ఓ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ లో.. ”నా కాలికి అనుకోకుండా గాయమైంది. మూడు వారాల పాటు డాక్టర్స్ నన్ను రెస్ట్ తీసుకోమన్నారు. ఓటీటీలో మంచి కంటెంట్ చూడటానికి ఉంటే సజెస్ట్ చేయండి” అని పోస్ట్ చేశారు.

దీంతో చాలా మంది కేటీఆర్‌ ట్వీట్ కి రిప్లైలు ఇస్తూ వాళ్ళకి తోచిన షోలని, సినిమాలని, సిరీస్ లని సజెస్ట్ చేశారు. నెటిజన్లతో పాటు పలు ఓటీటీలు, సెలబ్రిటీలు కూడా వాళ్ళ సినిమాలు, సిరీస్ లు చూడమని రిప్లైలు ఇస్తున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా కేటీఆర్ ట్వీట్‌కు స్పందించింది. ”పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు త్వరగా నవ్వుతూ కోలుకునేందుకు డీజే టిల్లు సినిమాను చూడాలని వైద్యులు చెప్పారు. అలాగే నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌’, లూప్‌ థ్రిల్‌ను ఎంజాయ్‌ చేయడానికి అమలా పాల్‌ ‘కుడి ఎడమైతే’, ప్రియమణి ఇన్వెస్టిగేటివ్‌ డ్రామా ‘భామ కలాపం’ చూడండి” అని రిప్లై ఇచ్చింది.

Directors : సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. కష్టాలన్నీ డైరెక్టర్లకే..

ఇక మరో ఓటీటీ జీ5 కూడా కేటీఆర్‌ ట్వీట్ కి స్పందిస్తూ.. ”కేటీఆర్‌ గారూ.. మార్నింగ్‌ మా నీళ్ల ట్యాంక్‌తో స్టార్ట్‌ చేసి రెక్కీతో థ్రిల్‌ అవుతూ, లంచ్‌ టైంకి ఫ్యామిలీతో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ కంప్లీట్‌ చేసి, రాత్రికి ఆర్‌ఆర్‌ఆర్‌ మళ్లీ చూసేయండి. మీరు రికవరీ అయ్యేదాక మేము మీకు వినోదాన్ని అందిస్తూనే ఉంటాము. మీరు అలా చూస్తూనే ఉండిపోతారు” అని రిప్లై ఇచ్చింది. ఇలా దొరికిందే ఛాన్స్ అని ఎవరి కంటెంట్ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. మరి మీరు కూడా ఏమన్నా సజెస్ట్ చేయాలి అనుకుంటే కేటీఆర్‌ ట్వీట్ కి రిప్లై ఇచ్చేయండి.