Pawan – Prabhas : టాలీవుడ్‌లో ‘రెండు భాగాలు’ హవా.. పవన్ నుంచి ప్రభాస్ వరకు!

టాలీవుడ్ లో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ గురించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ సినిమాలు రెండు పార్ట్స్ గా రాబోతున్నాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

Pawan – Prabhas : టాలీవుడ్‌లో ‘రెండు భాగాలు’ హవా.. పవన్ నుంచి ప్రభాస్ వరకు!

Pawan - Prabhas

Pawan – Prabhas : టాలీవుడ్ లో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ గురించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ సినిమాలు రెండు పార్ట్స్ గా రాబోతున్నాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక కథని రెండు భాగాలుగా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ట్రెండ్ అయ్యిపోయింది. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్.. కేజీఎఫ్, పుష్ప, పొన్నియిన్ సెల్వన్ సినిమాలు కొనసాగించాయి. తాజాగా మరో మూడు చిత్రాలు కూడా ఈ ట్రెండ్ ఫాలో అవబోతున్నాయి అని తెలుస్తుంది.

Pawan Kalyan: పవన్-సుజిత్ సినిమాలో అవేమీ ఉండవా.. అభిమానులు ఒప్పుకుంటారా..?

పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పిరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వార్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో సినిమా నిడివి ఎక్కువ వస్తుంది. కటింగ్ లు చేస్తే ప్రేక్షకుడు స్టోరీలో ఎమోషన్ ని మిస్ అవుతారని భావించి రెండు భాగాలుగా రిలీజ్ చేయడానికి మూవీ టీం ఆలోచిస్తుందట. అలాగే ఇటీవల మొదలైన పవన్ మరో సినిమా ‘OG’ కూడా టు పార్ట్స్ గా రాబోతుంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ రెండు వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు.

Prabhas : ఈ సంవత్సరం ప్రభాస్ మూడు సినిమాలు రిలీజ్ చేస్తాడా??

ఇక ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ప్రాజెక్ట్-K’ కూడా రెండు భాగాలుగా రాబోతుంది అంటున్నారు. ఈ మూవీ స్టోరీ మొత్తం ఫ్యూచర్ బ్యాక్ డ్రాప్‌లో జరుగుతూ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో సూపర్ హీరో తరహాలో ఉండబోతుంది. కథలో చూపించాల్సినవి చాలా ఉండడంతో మేకర్స్ ఏది కట్ చేయడానికి ఇష్టపడడం లేదట. దీంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్దమైందట. త్వరలోనే దీనిపై మూవీ టీం అధికారిక ప్రకటన చేయనున్నారు అని టాక్ వినిపిస్తుంది. అలాగే ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారట.