Pawan Kalyan : హరిహర వీరమల్లు.. మరో అప్డేట్.. తమిళ రచయితతో పవన్..

తాజాగా 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఇవాళ ఉదయం డైరెక్టర్ క్రిష్ తో పాటు తమిళ పాటల రచయిత మదన్ కార్కీ పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ సినిమా పాటల గురించి............

Pawan Kalyan :  హరిహర వీరమల్లు.. మరో అప్డేట్.. తమిళ రచయితతో పవన్..

Pawan Kalyan

Hari Hara Veeramallu :   ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నుంచి ‘భీమ్లా నాయక్’ సినిమా రావడానికి రెడీగా ఉండి. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనుంది.

ఇటీవలే ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో గ్రాండ్ విజువల్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు చాలా భారీ లెవెల్లో ఉన్నాయని, దానికి సంబంధించి ఈ సినిమా స్టంట్ మాస్టర్ షామ్ కౌషల్ దర్శకుడు క్రిష్ తో చర్చలు చేసినట్లు తెలుపుతూ వారిద్దరూ మాట్లాడిన ఓ ఫోటో షేర్ చేసి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ”హరి హర వీరమల్లు నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేస్తున్నాము. దానిపై బ్రిలియెంట్ డైరెక్టర్ క్రిష్ తో మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ సర్ కి, నిర్మాత AM రత్నం గారికి ధన్యవాదాలు. ఆ దేవుని ఆశీస్సులు మా సినిమాపై మరియు టీంపై ఉండాలని కోరుకుంటున్నాను” అని పోస్ట్ చేశారు.

Akhil sarthak : VJ సన్నీపై ఫైర్ అయిన అఖిల్ సార్థక్.. నువ్వు హీరో అవ్వడానికి పక్కవాళ్ళని జీరో చేయకు..

తాజాగా ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఇవాళ ఉదయం డైరెక్టర్ క్రిష్ తో పాటు తమిళ పాటల రచయిత మదన్ కార్కీ పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ సినిమా పాటల గురించి, తమిళ వర్షన్ డైలాగ్స్ గురించి చర్చించినట్లు తెలుస్తుంది. మదన్ పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటో, పవన్ కళ్యాణ్ తో చర్చిస్తున్న ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలని షేర్ చేసి.. ” పవన్ కళ్యాణ్ తో కవిత్వం, రాజకీయాలు, మానవ శాస్త్రం మరియు భాషాశాస్త్రం లాంటి అనేక వాటిపై జరిగిన చర్చలు ఎంతో ఆనందాన్నిచ్చాయి. సినిమా పాటల గురించి, డైలాగ్స్ గురించి పవన్ కళ్యాణ్ గారితో మంచి డిస్కషన్ జరిగింది.” అని పోస్ట్ చేశారు.

Lata Mangeshkar : ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు : నందమూరి బాలకృష్ణ

ఇప్పటికే ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అందుకు గాను బాలీవుడ్ యాక్టర్స్ ని కూడా ఈ సినిమాలో తీసుకున్నారు. తమిళ్ వర్షన్ కోసం ఈ డిస్కషన్స్ జరిగినట్టు తెలుస్తుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు అవ్వనుంది. ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.