Pawan Kalyan : మూడు నెలల్లో హరిహరవీరమల్లు అయిపోతుందా??

ఏప్రిల్ 29, 2022లోనే రిలీజ్ ప్లాన్ చేసుకున్న హరిహర వీరమల్లు కోవిడ్ కారణంగా షూటింగ్ బ్రేకవడంతో, పోస్ట్ పోన్ అయ్యింది. తిరిగి షూటింగ్ ఢిలే కావడంతో హరిహర వీరమల్లు ఆగిపోయిందా అని ఆడియన్స్.........

Pawan Kalyan : మూడు నెలల్లో హరిహరవీరమల్లు అయిపోతుందా??

Pawan

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అయిపోవడంతో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లుకు గండాల మీద గండాలు తప్పట్లేదు. ఏ ముహూర్తంలో ఈ సినిమాను స్టార్ట్ చేశారో కాని, ఆ మధ్య అయితే ఆగిపోయిందనే అన్నారు. ఆ తర్వాత మళ్లీ షెడ్యూల్ స్టార్ట్ అయినా అదీ సవ్యంగా సాగడం లేదు. మరి పవర్ స్టార్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమాకి ఎందుకు ఇన్ని కష్టాలు.

2020 జనవరిలో ముహూర్తం షాట్ తో స్టార్ట్ అయిన పవన్ కళ్యాణ్ 27వ సినిమా ఇప్పటి వరకూ షూటింగ్ కంప్లీట్ కాలేదు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేసుకుని, రంగంలోకి దిగిన డైరెక్టర్ క్రిష్ కి, భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్న ఏఎం రత్నంకు అదృష్టం కలిసి రావడంలేదనిపిస్తుంది. ఒకవైపు కరోనా, మరో వైపు పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ తో హరిహర వీరమల్లుకు వరుస ఆటంకాలు తప్పట్లేదు.

Maruthi : ప్రభాస్ ని పక్కన పెట్టేసిన మారుతి? నానితో మళ్ళీ??

ఏప్రిల్ 29, 2022లోనే రిలీజ్ ప్లాన్ చేసుకున్న హరిహర వీరమల్లు కోవిడ్ కారణంగా షూటింగ్ బ్రేకవడంతో, పోస్ట్ పోన్ అయ్యింది. తిరిగి షూటింగ్ ఢిలే కావడంతో హరిహర వీరమల్లు ఆగిపోయిందా అని ఆడియన్స్ కాదు పవన్ ఫ్యాన్స్ కూడా షాక్ కి గురయ్యారు. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ అవుతున్న ఫోటోలను వీడియోలను రిలీజ్ చేసి, క్రిష్ షెడ్యూల్ అనౌన్స్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ షెడ్యూల్ కోసం బాచుపల్లి, రామోజి ఫిలింసిటీలో భారీ సెట్స్ నిర్మించారు. అక్కడ దాదాపు పది రోజుల పాటు షూటింగ్ జరిగింది. ఆ షూట్లో పవన్ కళ్యాణ్ మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇదే ఊపులో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని అనుకున్నారు అంతా. అనూహ్యంగా పవన్ పొలిటికల్ టూర్ ప్రకటించడంతో ఈ సినిమాకు మరోసారి పెద్ద గండమే ఎదురైంది.

Varun Dhawan : సౌత్ దర్శకులని ఆకాశానికెత్తేసిన బాలీవుడ్ యువ హీరో..

 

ఇప్పటి వరకూ ఈ సినిమా 50 శాతం కూడా షూటింగ్ పూర్తి కాలేదు. అక్టోబర్ నుంచి పవన్ పొలిటికల్ టూర్ ఉండటంతో ఇంకా మూడు నెలల గ్యాప్ లో మిగతా 50 పర్సెంట్ బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ అవుతుందా, లేదా అనేది ఫ్యాన్స్ కే కాదు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కి ఉన్న పెద్ద డౌట్. దాదాపు 150 కోట్ల బడ్జెట్ ప్లానింగ్ తో రంగంలోకి దిగిన ఏఎం రత్నంకు ఈ సినిమా గుదిబండలా మారింది. మరో పక్క క్రిష్ కి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఆర్టిస్టుల డేట్స్ అడ్జెస్ట్ చేయడం, షూటింగ్ షెడ్యూల్స్ ప్రిపేర్ చేయడానికే తల ప్రాణం తోకకొస్తుంది. హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ ను పాన్ఇండియా హీరోగా చూడాలని ఉబలాటపడుతున్న ఫ్యాన్స్ కి వచ్చే సంక్రాంతి వరకైనా ఆ కోరిక తీరుతుందో లేదో చూడాలి మరి.