Pathaan : లోక్ సభలో పఠాన్ సినిమా గురించి మోడీ వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న వీడియో!

2013లో చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా తరువాత సరైన హిట్ లేని షారుఖ్ ఖాన్.. పఠాన్ చిత్రంతో సంచలనాలే సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం దేశం మొత్తం పఠాన్ మానియా నడుస్తుంది. ఆఖరికి దేశ ప్రధాని కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. అది కూడా ప్రజలు సమస్యలు చర్చించే పార్లమెంట్ లో ప్రస్తావించడం చర్చనీయాంశం అయ్యింది.

Pathaan : లోక్ సభలో పఠాన్ సినిమా గురించి మోడీ వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న వీడియో!

PM Narendra Modi

Pathaan : 2013లో చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా తరువాత సరైన హిట్ లేని షారుఖ్ ఖాన్.. పఠాన్ చిత్రంతో సంచలనాలే సృష్టిస్తున్నాడు. ఈ మూవీతో కేవలం తన కమ్‌బ్యాక్ మాత్రమే కాదు బాలీవుడ్ కి పూర్వ వైభవం కూడా తీసుకు వచ్చాడు. గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటలేకపోతున్నాయి. ఇక బాలీవుడ్ పని అయిపోయింది అనుకున్న సమయంలో కింగ్ ఖాన్ షారుఖ్.. తన సినిమాతో కింగ్ లా హిందీ పరిశ్రమను కాపాడుకున్నాడు. ప్రస్తుతం దేశం మొత్తం పఠాన్ మానియా నడుస్తుంది.

Pathaan: పఠాన్ @ వెయ్యి కోట్ల మార్క్.. మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిందిగా!

ఆఖరికి దేశ ప్రధాని కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. అది కూడా ప్రజలు సమస్యలు చర్చించే పార్లమెంట్ లో ప్రస్తావించడం చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం లోక్ సభ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సభలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు గురించి మాట్లాడుతూ.. ఈరోజు శ్రీనగర్ లో థియేటర్‌ల్లో హౌస్ ఫుల్ షోలు పడుతున్నాయి అంటూ ప్రస్తావించారు. ఇటీవలే కాశ్మీర్ లో థియేటర్లు పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. థియేటర్లు స్టార్ట్ అయ్యాక పఠాన్ సినిమా వలనే అక్కడ హౌస్ ఫుల్ షోలు పడుతున్నాయి.

ఈ విషయం గురించి మాట్లాడుతూనే నరేంద్ర మోడీ లోక్ సభలో ఆ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా పఠాన్ చిత్రం.. హిందీ, తెలుగు, తమిళంలో కలిపి ఇప్పటి వరకు రూ.452.95 కోట్ల నెట్ షేర్ సాధించింది. ప్రస్తుతం హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద కేజీఎఫ్-2 సెట్ చేసిన రికార్డుని బ్రేక్ చేసింది. ఇలాగే మరికొన్ని రోజులు కలెక్షన్స్ రాబడితే హిందీ బాహుబలి-2 రికార్డులను బ్రేక్ చేయడంలో కూడా సందేహం లేదు అంటున్నారు సినిమా పండితులు. మరి ఈ చిత్రం బాహుబలి రికార్డుని బ్రేక్ చేస్తుందా? లేదా? చూడాలి.