Project K: ప్రాజెక్ట్ K.. సైలెంట్‌గా కానిచ్చేశారా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ ‘ప్రాజెక్ట్-K’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మహానటి ఫేం దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ మాత్రం రావడం లేదు.

Project K: ప్రాజెక్ట్ K.. సైలెంట్‌గా కానిచ్చేశారా..?

Poject K Movie Update By Ashwini Dutt

Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ ‘ప్రాజెక్ట్-K’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మహానటి ఫేం దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ మాత్రం రావడం లేదు. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ వస్తే బాగుంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Project K: ప్రాజెక్ట్-K గ్లింప్స్‌పై దుల్కర్ హాట్ కామెంట్స్

ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు పూర్తయ్యిందో అనే ఆతృత కూడా అభిమానుల్లో నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా, చిత్ర నిర్మాత అశ్వినీ దత్ ప్రాజెక్ట్ K గురించి ఓ సర్‌ప్రైజ్ అప్డేట్‌ను బట్టబయలు చేశారు. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న నిర్మాత అశ్వినీ దత్, ఆయన బ్యానర్ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సీతా రామం’ సక్సెస్ కావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని.. అలాగే ఇతర తెలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకుని, ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్-K గురించి కూడా ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.

Project K: బిగ్ స్టార్ క్యాస్టింగ్‌తో ప్రాజెక్ట్ కే.. పెరిగిపోతున్న అంచనాలు!

సైన్స్ ఫిక్షన్ సినిమాగా వస్తున్న ప్రాజెక్ట్-K ఇప్పటికే 55 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని.. మిగతా షూటింగ్‌ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేశామని.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ తదితరులు నటిస్తున్నారని.. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిస్తున్న విధానం సూపర్బ్‌గా ఉందని ఆయన అన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఇంత సైలెంట్‌గా ప్రాజెక్ట్K సినిమా అప్పుడే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకుందా అంటూ వారు ముక్కున వేలేస్తున్నారు.