Pooja Hegde: ఆగని పూజా జోరు!

క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే కోసం టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎంతలా ఎదురుచూస్తుంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె టాలీవుడ్‌లో ఓ సినిమా ఒప్పుకుందంటే, అది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్....

Pooja Hegde: ఆగని పూజా జోరు!

Pooja Hegde To Kick Start Salman Khan Movie From May 12

Pooja Hegde: క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే కోసం టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎంతలా ఎదురుచూస్తుంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె టాలీవుడ్‌లో ఓ సినిమా ఒప్పుకుందంటే, అది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ అనే భావన వారిలో నెలకొంది. అందుకే పూజా హెగ్డేను భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తమ సినిమాల్లో నటింపజేయాలని ఇక్కడి దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ అయితే బీస్ట్ మూవీ ప్రమోషన్స్‌లో పూజాను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తారు. ‘పూజా మన కాజా’ అంటూ దిల్ రాజు చేసిన కామెంట్ సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

Pooja Hegde: పూజాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందా..?

కానీ ఇదంతా ఆమె సూపర్ ఫాంలో ఉన్నప్పటి మాటలు. ప్రస్తుతం పూజా కెరీర్ పరంగా చూసుకుంటే, ఆమె నటించిన మూడు సినిమాలు వరుసగా ఫెయిల్యూర్లుగా మిగిలాయి. దీంతో ఆమె ఫ్లాప్ మూవీలతో హ్యాట్రిక్ అందుకుంది. పూజా నటించిన రాధేశ్యామ్, బీస్ట్, లేటెస్ట్ మూవీ ఆచార్య ప్రేక్షకులను మెప్పించడంలో అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో పూజాకు కష్టకాలం వచ్చిందని ఆమె అభిమానులు అంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో కూడా పూజా మాత్రం తన జోరును కొనసాగిస్తూ అందరికీ షాకిస్తోంది.

పూజా హెగ్డే ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలను లైన్‌లో పెట్టింది. ఇప్పటికే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో పూజా హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యింది. ఇక పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రాబోయే సినిమాలోనూ పూజానే హీరోయిన్. దీంతో పాటు ఎఫ్3 సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో పూజా చిందులు వేసింది. టాలీవుడ్‌లోనే కాకుండా అమ్మడు తన దూకుడును బాలీవుడ్‌లోనూ చూపిస్తోంది. ఇప్పటికే రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘సర్కస్’ సినిమాలో పూజా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను జూలై 15న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Pooja Hegde: పడిపోతున్న బుట్టబొమ్మ గ్రాఫ్.. ఆ ఇద్దరిపైనే పుట్టెడు ఆశలు!

దీంతో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దివాలి’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్న పూజా, ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యింది. మే 12న ఈ చిత్ర షూటింగ్‌లో పూజా జాయిన్ కాబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇలా వరుసగా ఫ్లాపులు వస్తున్నా, పూజా హెగ్డే మాత్రం తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.