Pooja Hegde: పడిపోతున్న బుట్టబొమ్మ గ్రాఫ్.. ఆ ఇద్దరిపైనే పుట్టెడు ఆశలు!

Pooja Hegde: పడిపోతున్న బుట్టబొమ్మ గ్రాఫ్.. ఆ ఇద్దరిపైనే పుట్టెడు ఆశలు!

Pooja Hegde

Pooja Hegde: ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందంటే, ఆ సక్సెస్ క్రెడిట్ మేజర్ షేర్ హీరో, హీరోయిన్స్ కి వెళ్తుంది. ఒక వేళ సినిమా ఫ్లాప్ అయినా అంతే. ఆ మధ్య వరుస సక్సెస్ లతో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లోకి దూసుకెళ్లిన గ్లామర్ డాల్ పూజా హెగ్డే గ్రాఫ్ ఈ మధ్య వరస ఫ్లాప్ లతో పడిపోతోంది. ఎందుకు పూజా హెగ్డే మాజిక్ వర్కవుట్ కావడం లేదు.?

Pooja Hegde: పూజాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందా..?

టాలీవుడ్ లో అందం, అభినయం కలసిన హీరోయిన్స్ లో పూజా హెగ్డే ఒకరు. పూజా హెగ్డే నటించిన సినిమాలు వరసగా సక్సెస్ అవడంతో టాలీవుడ్ స్టార్స్ కి బెస్ట్ ఆప్షన్ గా పూజా హెగ్డే కనిపించేది. అలాంటిది ఈ మధ్య కాలంలో బుట్టబొమ్మ నటించిన సినిమాలు ఎందుకో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయి. రాధేశ్యామ్, బీస్ట్ ఆచార్య వంటి స్టార్ వాల్యూ మూవీస్ లో నటించినా బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్టర్ కావడంలో విఫలమవుతుంది.

Pooja Hegde: పాపం పూజ.. సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్న నెటిజన్లు!

మార్చి, ఏప్రిల్ రెండు నెలల గ్యాప్ లో నే పూజా హగ్డే చేసిన మూడు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.. పాన్ ఇండియా లెవల్ లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన రాధేశ్యామ్ లో ప్రేరణగా మంచి నటననే కనబరిచింది. అయినా సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమయింది. పూజాహెగ్డే గ్లామర్, పెర్ఫామెన్స్ కూడా ఈ సినిమాకు ప్లస్ కాలేదు. అప్పటి నుంచి వరసగా ఫ్లాప్స్ ఎదురై పూజా ఫాన్స్ కు నిరాశనే మిగిలిస్తున్నాయి.

Pooja Hegde: జిగేలు రాణి ఈజ్ బ్యాక్.. ఎఫ్‌3లో పూజా స్పెషల్ ట్రీట్!

రాధేశ్యామ్ తర్వాత దాదాపు నెల గ్యాపులో రిలీజ్ అయిన బీస్ట్, తమిళ స్టార్ హీరో విజయ్ కి జోడీగా చేసింది. వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన బీస్ట్ సాంగ్స్ కు వరల్డ్ వైడ్ ఆడియన్స్ నుంచి, భారీ రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్ ఫాస్ట్ గా ఆల్ టైమ్ రికార్డు స్తాయిలో సోషల్ మీడియాను షేక్ చేసినా, సినిమా మాత్రం ఫ్లాప్ లిస్ట్ లోకే చేరిపోయింది. ఆ తర్వాత పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ తో జత కట్టిన ఆచార్య రిలీజ్ అయింది. ఆచార్యతో అయినా అమ్మడు లక్ మారిపోతుందని ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ ఆచార్యతోనూ పూజాహెగ్డే ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది.

Pooja Hegde: పూజా రేటు కోటి.. సినిమాకు కాదండోయ్!

ప్రస్తుతం పూజా హెగ్డే మహేశ్ బాబుతో త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటిస్తోంది. ఆల్రెడీ మహర్షి సినిమాతో మహేశ్, పూజా హెగ్డే కాంబినేషన్ కి మంచి మార్కులే పడ్డాయి. ఇక అల వైకుంఠ పురంలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ తో మరోసారి నటిస్తుంది. సో ఏ రకంగా చూసిన సక్సెస్ కాంబినేషనే కావడంతో ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ పక్కా అనే కాన్ఫిడెన్స్ ను ప్రదర్శిస్తుంది బుట్టబొమ్మ. ఇంకా దువ్వాడ జగన్నాధం లాంటి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లోనూ పవన్ కళ్యాణ్ సరసన నటించబోతుంది. సో ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవుతాయని లెక్కలేసుకుంటుంది పూజాహెగ్డే. ఆ రెండు సినిమాల మీదే పుట్టెడు ఆశలు పెట్టుకుంది.