Prabhas : దుల్కర్ కోసం ప్రభాస్.. సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా..

ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ ముఖ్య అతిధిగా రానున్నారు. సీతారామం సినిమా వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. ఇదే నిర్మాణ సంస్థలో ప్రభాస్.....

Prabhas : దుల్కర్ కోసం ప్రభాస్.. సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా..

Sita Ramam :  మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ మొదటిసారి ‘సీతారామం’తో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని తమిళ్, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సుమంత్, రష్మిక, తరుణ్ భాస్కర్ ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు. మంచి లవ్ స్టోరీలను తెరకెక్కించే హను రాఘవపూడి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్ తో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Ranveer Singh : సమంత మీద ఇష్టం మరింత పెరుగుతుంది.. ఆమెతో సినిమా చేయాలి..

తాజాగా ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ ముఖ్య అతిధిగా రానున్నారు. సీతారామం సినిమా వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. ఇదే నిర్మాణ సంస్థలో ప్రభాస్ ప్రాజెక్టు K చేస్తుండటంతో ప్రభాస్ ని గెస్టుగా తీసుకొస్తున్నారు. ప్రభాస్ మళ్ళీ చాలా రోజుల తర్వాత స్టేజి మీద కనపడతాడు అని తెలియడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక మలయాళ సూపర్ స్టార్ దుల్కర్, ప్రభాస్ ఇద్దరూ ఒకే స్టేజిపై కనువిందు చేస్తుండటంతో ఈ ఈవెంట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 3న హైదరాబాద్ లో జరగనుంది. దీనికి సంబంధించి అధికారికంగా పోస్టు చేశారు చిత్ర నిర్మాణ సంస్థ.

View this post on Instagram

A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)