Prakash Raj: ఈడీలు, బాడీలు.. ఎవడు చేస్తున్నాడు, ఎవరిని బెదిరిస్తున్నారు : ప్రకాశ్ రాజ్
సినీ యాక్టర్ ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం తాను నటిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమా రిలీజ్‌కు రెడీ కావడంతో, ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో హాస్యబ్రహ్మ డా.బ్రహ్మానందం ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఉగాది కానుకగా ఈ సినిమా మంచి అంచనాల మధ్య రిలీజ్ అవుతుండగా, తాజాగా ఈ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్‌లో పాల్గొంది.

Prakash Raj Comments On MLC Kavitha Issue
Prakash Raj: సినీ యాక్టర్ ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం తాను నటిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమా రిలీజ్‌కు రెడీ కావడంతో, ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో హాస్యబ్రహ్మ డా.బ్రహ్మానందం ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఉగాది కానుకగా ఈ సినిమా మంచి అంచనాల మధ్య రిలీజ్ అవుతుండగా, తాజాగా ఈ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్‌లో పాల్గొంది.
ఈ సందర్భంగా నటుడు ప్రకాశ్ రాజ్ సినిమాలతో పాటు ప్రస్తుత రాజకీయాలపై కూడా కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న అంశంపై ప్రకాశ్ రాజ్ స్పందించాడు. ‘‘ఈడీలు, బాడీలు అంటున్నారు.. దీని వెనకున్న రాజకీయం ప్రజలకు తెలుస్తోంది.. ఎవడు చేస్తున్నాడు.. ఎవరిని బెదిరిస్తున్నారు.. కేసీఆర్, కేటీఆర్, తెలంగాణ ప్రజలు, కవిత స్ట్రాంగ్‌గా ఉన్నారు.. ఇలాంటి రాజకీయాలను వారు సమర్ధవంతంగా ఎదుర్కోగలరు.. కవిత మన ఆడబిడ్డ.. కవిత ఎప్పుడూ ఫైట్ చేస్తూనే ఉంటారు.. కల్వకుంట్ల కవితకు అండగా ఉంటాం..’’ అని తనదైన కామెంట్స్ చేశారు.
Prakash Raj: తెలంగాణాలో ఎమ్మెల్యే ల కొనుగోలు పై ప్రకాష్ రాజ్ సంచలన ట్విట్..
ఇక ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రకాశ్ రాజ్ రాజకీయంగా మోదీని నిత్యం విమర్శిస్తూ కనిపిస్తాడు. సోషల్ మీడియాలో బీజేపీ పాలనపై ఆయన సెటైర్స్ వేస్తూ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శకులు గుప్పుతుంటాడు. ఇక రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకులకు ఓ మంచి కథను అందిస్తున్నామని ప్రకాశ్ రాజ్ ప్రెస్ మీట్‌లో తెలిపాడు.