AP Cinema Ticket Rates : సినిమా టికెట్ రేట్ల గురించి చాలా మాట్లాడాలి.. సపరేట్‌గా ప్రెస్‌మీట్ పెడతాను

నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. ''సినిమా టికెట్ రేట్ల గురించి మాట్లాడాల్సింది చాలా వుంది. గవర్నమెంట్ కు గానీ ఇండస్ట్రీ వాళ్లకు గానీ సమస్యల గురించి పూర్తిగా తెలీదు....

AP Cinema Ticket Rates : సినిమా టికెట్ రేట్ల గురించి చాలా మాట్లాడాలి.. సపరేట్‌గా ప్రెస్‌మీట్ పెడతాను

Aadiseshagirirao

AP Cinema Ticket Rates :   గత కొన్ని నెలలుగా ఏపీ ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమ మధ్య వాదోపవాదాలు, చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ పట్ల, థియేటర్ల పట్ల, సినిమా టికెట్ రేట్ల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలను చాలా మంది సినీ ప్రముఖులు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ల విధానంలో తీసుకున్న నిర్ణయాలని వ్యతిరేకిస్తూ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. గత రెండు రోజుల నుంచి ఆర్జీవీ కూడా ఈ విషయంపై ట్విట్టర్ లో పేర్ని నానితో చర్చలు చేశాడు. టాలీవుడ్ నుంచి ఇలా ఎవరో ఒకరు ఏపీ సినిమా టికెట్ ధరల గురించి మాట్లాడుతూనే ఉన్నారు.

తాజాగా ఈ విషయంపై సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, నిర్మాత ఆదిశేషగిరిరావు కామెంట్స్ చేశారు. ఇవాళ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘హీరో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న నిర్మాత ఆదిశేషగిరిరావు సినిమా టికెట్ రేట్ల విషయంలో కామెంట్స్ చేశారు.

Anushka Sharma : ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’‌.. మహిళా క్రికెటర్ ఝులన్‌ గోస్వామి బయోపిక్‌లో అనుష్కశర్మ

నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. ”సినిమా టికెట్ రేట్ల గురించి మాట్లాడాల్సింది చాలా వుంది. గవర్నమెంట్ కు గానీ ఇండస్ట్రీ వాళ్లకు గానీ సమస్యల గురించి పూర్తిగా తెలీదు. టికెట్ రేట్ల గురించి సపరేట్ గా మీడియా సమావేశం పెడతాను. అక్కడ అన్ని విషయాలు చెపుతాను. సినిమా అనేది సినిమానే. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి ఎన్నో వచ్చాయి. కాని సినిమాని థియేటర్ లో చూస్తేనే సినిమా బాగుంటుంది. ఎన్ని వచ్చినా థియేటర్ అనేది ఎప్పటికీ వుంటుంది” అని వ్యాఖ్యలు చేశారు.