Sardar 2 : సర్దార్ 2ని అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు.. ఈసారి కంబోడియాలో..

సినిమా చూసిన వాళ్లకి సర్దార్ పార్ట్ 2 ఉండబోతోంది అని అర్ధమవుతుంది. అయితే తాజాగా చిత్ర నిర్మాతలు అధికారికంగా సర్దార్ 2 ఇదే దర్శకుడితో ఉండబోతుందని ప్రకటించారు. ఈ మేరకు సినిమా చివర్లోని...........

Sardar 2 : సర్దార్ 2ని అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు.. ఈసారి కంబోడియాలో..

producers announced karthi Sardar 2 movie officially

Sardar 2 :  తమిళ్ స్టార్ హీరో కార్తీ డ్యూయల్ రోల్ లో రాశిఖన్నా, రజీషా హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా సర్దార్. ps మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళికి రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. తమిళ్, తెలుగులో రిలీజయిన ఈ సినిమా ప్రేక్షకులకి బాగా నచ్చేసి మంచి కలెక్షన్లని కూడా రాబడుతుంది. తెలుగులో కార్తీకి మంచి మార్కెట్ ఉంది. సినిమా బాగుండటంతో తెలుగులో కూడా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి ఈ సినిమాకి.

వాటర్ మాఫియాపై, వాటర్ బాటిల్స్ వల్ల కలిగే అనారోగ్యాలని అంశంగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. చాలా థ్రిల్లింగ్ సబ్జెక్టు గా ఈ సినిమాని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులో తండ్రి, కొడుకు పాత్రల్లో కార్తీ అదరగొట్టేశాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాని చక్కగా తీశారు. సినిమా చివర్లోనే సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి వదిలేశారు.

Kannada Movies : డిమాండ్ లో కన్నడ సినీ పరిశ్రమ.. హీరోలు, డైరెక్టర్లు ఎవ్వరూ తగ్గట్లేదు..

సినిమా చూసిన వాళ్లకి సర్దార్ పార్ట్ 2 ఉండబోతోంది అని అర్ధమవుతుంది. అయితే తాజాగా చిత్ర నిర్మాతలు అధికారికంగా సర్దార్ 2 ఇదే దర్శకుడితో ఉండబోతుందని ప్రకటించారు. ఈ మేరకు సినిమా చివర్లోని సన్నివేశాన్ని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సారి కంబోడియాలో ఏజెంట్ గా మిషన్ చేయబోతున్నట్టు హింట్ ఇచ్చారు. అయితే పార్ట్ 2కి సర్దార్ 2 అనే టైటిల్ పెడతారా లేదా వేరే ఏదైనా టైటిల్ పెడతారో, ఈ సారి ఏ కంటెంట్ తీసుకుంటారో చూడాలి మరి.