Producers : శ్రీమంతుడు సినిమా నుంచి మహేష్ మాకు సపోర్ట్ చేస్తున్నారు | Producers Speech in Sarkaru Vaari Paata Pre Release Event

Producers : శ్రీమంతుడు సినిమా నుంచి మహేష్ మాకు సపోర్ట్ చేస్తున్నారు

ఈ ఈవెంట్ లో నిర్మాత నవీన్ మాట్లాడుతూ.. మా బ్యానర్లో మొదట మహేష్ గారు శ్రీమంతుడు చేశారు. అప్పుడు మాకు అంత అనుభవం లేకపోయినా మహేష్ గారు.............

Producers : శ్రీమంతుడు సినిమా నుంచి మహేష్ మాకు సపోర్ట్ చేస్తున్నారు

Sarkaru Vaari Paata :  సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇవాళ (మే 7న) హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.

Sudheer Babu : నెపోటిజం లాంటి మాటలు మాట్లాడొద్దు.. నా మాటలు కాంట్రవర్సీ అవుతాయి..

ఈ ఈవెంట్ లో నిర్మాత నవీన్ మాట్లాడుతూ.. మా బ్యానర్లో మొదట మహేష్ గారు శ్రీమంతుడు చేశారు. అప్పుడు మాకు అంత అనుభవం లేకపోయినా మహేష్ గారు మాకు సపోర్ట్ చేశారు. మాకు అప్పుడే పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. మళ్ళీ మీతో సినిమా తీయాలనుకుంటున్నాము. డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. తమన్ గారు మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ సినిమాకి పని చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఫ్యాన్స్ ఆశించిన దానికంటే సినిమా ఎక్కువగా ఉంటుంది.

నిర్మాత రవి మాట్లాడుతూ… మనం మహేష్ గారిని ఎలా చూడాలనుకుంటామో పరుశురాం గారు అలా చూపించారు. ఈ సినిమా డబల్ బ్లాక్ బస్టర్ అవుతుంది.

×