Radheshyam Poster: ప్రభాస్ అభిమానులకు పండుగే

అందరి హీరోల సినిమా పోస్టర్లు రిలీజ్ అవుతున్నాయి. కానీ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా నుంచి మాత్రం ఇప్పటి వరకు రెండంటే రెండే పోస్టర్స్ వచ్చాయి.. అవి కూడా మూడు నెలల క్రితం.. అప్పటి నుంచి సినిమా అప్డేట్ లేక ప్రభాస్ అభిమానులు నిరాశపడిపోయారు.

Radheshyam Poster:  ప్రభాస్ అభిమానులకు పండుగే

Radhesyam Poster

Radheshyam: అందరి హీరోల సినిమా పోస్టర్లు రిలీజ్ అవుతున్నాయి. కానీ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా నుంచి మాత్రం ఇప్పటి వరకు రెండంటే రెండే పోస్టర్స్ వచ్చాయి.. అవి కూడా మూడు నెలల క్రితం.. అప్పటి నుంచి సినిమా అప్డేట్ లేక ప్రభాస్ అభిమానులు నిరాశపడిపోయారు. ఉగాదికైనా పోస్టర్ విడుదల చేస్తారా? లేదా? అనే అనుమానంతో ఉన్న ప్రభాస్ అభిమానులను చిత్ర బృందం ఆనందంలో ముంచేసింది.

ఉగాది రోజు సడెన్ గా పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ప్రేమే లోకంగా జీవిస్తూ ప్రేయసి కోసమే పరితపించే ఒక నిజాయితీ ఉన్న ఘాడ ప్రేమికుడిగా ప్రభాస్ కనిపిస్తున్నాడు. మిరిమిట్లు గొలిపే ప్రభాస్ అందమైన రూపం అటు ఉత్తరాది ప్రేక్షకులని, ఇటు దక్షణాది ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉంది. ఉగాది శుభ సందర్భంగా ప్రభాస్ రాధే శ్యామ్ నిర్మాతలు ఈ చిత్రం కొత్త పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ అద్భుతమైన మనోహరమైన ప్రేమికుడిగా అతడిలోని కోణాన్ని ఆవిష్కరిస్తోంది.

చాలా కాలం తర్వాత ప్రభాస్ ఓ ఫుల్ లెన్త్ లవ్ స్టోరీ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. జూలై 30 న సినిమా విడుదల కానుంది. యువి క్రియేషన్స్- టీసిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.