Kesineni Vs Kolikapudi: ఎంపీ Vs ఎమ్మెల్యే.. మ్యాటరేంటి? తిరువూరు టీడీపీలో రచ్చ రచ్చ.. కొలికపూడి, కేశినేని చిన్నికి ఎక్కడ చెడింది?
ఒకరినొకరు కోవర్టులు అంటూ దుమ్మెత్తిపోసుకోవడంతో ఇష్యూ పెద్దది అయింది. దీంతో టీడీపీ అధిష్టానం సీరియస్ అయి..అటు ఎంపీ కేశినేని చిన్నిని..ఇటు ఎమ్మెల్యే కొలికపూడిని

Kesineni Vs Kolikapudi: టీడీపీ అపోజిషన్‌లో ఉన్నప్పుడు హైలెట్ అయ్యారు. అమరావతి రైతుల కోసం గళమెత్తి లైమ్‌లైట్‌లో నిలిచారు. కట్ చేస్తే అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఏదో ఒక కాంటవర్సీకి కేరాఫ్ అవుతున్నారు సదరు నేత. ఆయన కొని మరీ సమస్యలు తెచ్చి పెట్టుకుంటున్నారన్న టాక్ కూడా ఉంది. ఇప్పుడు ఏకంగా ఎంపీని గెలికి రచ్చకెక్కారు ఎమ్మెల్యే. దీంతో తిరువూరు వార్ ఇప్పుడు పీక్‌కు చేరింది. అసలు ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ఎక్కడ చెడింది? చిన్నిని కొలికపూడి ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు?
తిరువూరు టీడీపీ రాజకీయం హీటెక్కుతోంది. కాంట్రవర్సీ ఎమ్మెల్యేగా పేరున్న కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పుడు ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేసి రచ్చకెక్కారు. ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. 2024 ఎన్నికల్లో తిరువూరు అసెంబ్లీ టీడీపీ టికెట్ కోసం 5 కోట్ల రూపాయలు కేశినేని చిన్ని అడిగారని ఆరోపించారు కొలికపూడి. అంతేకాదు తన అకౌంట్ నుంచి మూడుసార్లుగా రూ.60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు తన మొబైల్‌లో వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నారు.
ఇక ఎంపీ చిన్ని పీఏ మోహన్ తీసుకెళ్లిన రూ.50 లక్షలు..తన మిత్రులు ఇచ్చిన రూ.3 కోట్ల 50 లక్షల గురించి తర్వాత మాట్లాడుకుందాం.. నిజమే గెలవాలి అంటూ పోస్టులు పెట్టారు కొలికపూడి. దీంతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వార్ పీక్‌కు చేరింది.
తిరువూరులో ఎంపీ కేశినేని చిన్ని సుడిగాలి పర్యటన చేశారు. ఈ టూర్‌కు స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దూరంగా ఉన్నారు. అయితే కొలికపూడి చేసిన ఆరోపణలపై కేశినేని చిన్న సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు. తాను ఎప్పుడూ జేబులో నుంచి మాత్రమే డబ్బులు ఖర్చు పెడతానన్నారు. ఐదు లక్షలు..పది లక్షల గురించి తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలను ప్రజలు నమ్మరన్న ఆయన..తానెప్పుడు రంగులు మార్చలేదన్నారు.
లిక్కర్ డబ్బులతో రాజకీయాల్లోకి రాలేదంటూ మరో పోస్ట్..
12 నెలలు దేవుడిగా ఉన్న తాను..ఇప్పుడు దెయ్యంగా మారానా అంటూ ఎమ్మెల్యే కొలికిపూడిని ప్రశ్నించారు చిన్ని. తాను పొద్దునే పేర్ని నానితో మధ్యాహ్నం దేవినేని అవినాష్‌తో సాయంత్రం కేశినేని నానితో రాత్రికి స్వామిదాస్‌తో కాపురం చెయ్యను అంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఎంపీ చిన్ని చేసిన విమర్శలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు ఎమ్మెల్యే కొలికపూడి. తాను జగన్ మీద పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చానన్న ఆయన..కసిరెడ్డి, చెవిరెడ్డి ఇచ్చిన లిక్కర్ డబ్బులతో రాజకీయాల్లోకి రాలేదు అంటూ పోస్ట్ పెట్టి ఇష్యూను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు.
ఒకరినొకరు కోవర్టులు అంటూ దుమ్మెత్తిపోసుకోవడంతో ఇష్యూ పెద్దది అయింది. దీంతో టీడీపీ అధిష్టానం సీరియస్ అయి..అటు ఎంపీ కేశినేని చిన్నిని..ఇటు ఎమ్మెల్యే కొలికపూడిని శుక్రవారం పార్టీ ఆఫీస్‌కు రావాలని ఆదేశించారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. అయితే వివాదాలకు కేరాఫ్‌గా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎపిసోడ్ టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వార్నింగ్‌లు ఇచ్చినా..ఎంత చెప్పినా తీరు మార్చుకోకపోవడంతో సీఎం చంద్రబాబు కొలికపూడిపై చాలా సీరియస్‌గా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఓసారి సీఎం చంద్రబాబు మందలించడంతో కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కొలికపూడి..ఇప్పుడు మళ్లీ రచ్చకెక్కడం హాట్ టాపిక్ అవుతోంది.
టీడీపీ అధిష్టానం ఆయన కోరలు పీకేసిందన్న గుసగుసలు..
ఇలా వరుస వివాదాలతో ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూను క్రియేట్ చేస్తున్నారనే టీడీపీ అధిష్టానం కొలికపూడి కోరలు పీకేసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొలికపూడి తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ..వరుస వివాదాలతో సృష్టిస్తుండటంతో..ఎంపీ కేశినేని చిన్నికి టీడీపీ అధిష్టానం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించిందన్న టాక్ వినిపిస్తోంది. అప్పటి నుంచి తిరువూరు నియోజకవర్గ బాధ్యతల్ని ఎంపీ కేశినేని చిన్ని చక్కబెడుతున్నారట. దీంతో కొలికపూడి పరిస్థితి తిరువూరులో పేరుకే ఎమ్మెల్యే అన్నట్లుగా మిగిలిపోయారన్నది లోకల్ టాక్.
దీంతో మరోసారి కొలికపూడి ఫ్రస్ట్రేషన్ పీక్ లెవల్‌కు చేరిందని..బరస్ట్ అయి కేశినేని చిన్నిపై రెచ్చిపోయి ఆరోపణలు చేస్తున్నారని పలువురు తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో కొలికపూడిపై సీరియస్ యాక్షన్ తీసుకునే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు ఇన్‌సైడ్ టాక్. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఎపిసోడ్ ఎటు దారితీస్తుందో చూడాలి.
Also Read: లా అండ్ ఆర్డర్ పై పవన్ కల్యాణ్ ఫోకస్.. రాద్దాంతం ఎందుకు? ఆరా తీయడం తప్పా?