Dhoni-Rai Lakshmi : ధోనితో బ్రేకప్ అయినా నన్ను వదలట్లేదు

ధోనితో లవ్‌ ట్రాక్‌ నడిపిన విషయంపై రాయ్ లక్ష్మి స్పందించింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్ ధోని‌తో ఉన్న ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడింది. ఆయనతో రిలేషన్ తన జీవితంపై......

Dhoni-Rai Lakshmi : ధోనితో బ్రేకప్ అయినా నన్ను వదలట్లేదు

Dhoni Rai Lakshmi

Dhoni-Rai Lakshmi :  మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. క్రికెట్ లో ఓ జనరేషన్ కి దేవుడు లాంటి వాడు. ఎన్నో సార్లు సింగిల్ హ్యాండ్ తో ఇండియాని గెలిపించాడు. ఇండియాకి ఎన్నో విజయాలను అందించాడు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి లోకల్ మ్యాచ్ లు ఆడుతూ, మన ఇండియా టీంకి సలహాలిస్తూ ఉన్నాడు ధోని. అందరి క్రికెటర్స్ లాగే ధోని కూడా క్రికెట్‌ కెరీర్‌ తొలినాళ్లల్లో కొన్ని లవ్‌ ట్రాక్‌లు నడిపినట్లు వార్తలు వచ్చాయి.

Vikky – Katrina : నన్ను పెళ్ళికి పిలవలేదు.. విక్కీ-కత్రీనా మ్యారేజ్ పై కియారా

చాల మంది క్రికెటర్స్ సినిమా వాళ్ళతోనే ప్రేమలో పడతారు, డేటింగ్ చేస్తారు. గతంలో ధోని కూడా హీరోయిన్ రాయ్ లక్ష్మితో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. 2008 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథిగా ధోని ఉన్న సమయంలోనే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు, అప్పట్లో ఐపీఎల్ మ్యాచ్ లు అయిపోయిన తర్వాత జరిగే పార్టీలకు ధోనితో కలిసి రాయ్ లక్ష్మీ కూడా హాజరైనట్లు సమాచారం. దాదాపు ఒక సంవత్సరం పాటు వీరిద్దరి మధ్య డేటింగ్ కొనసాగిందని అనుకున్నారు. రాయ్ లక్ష్మీ‌తో ధోని డేటింగ్ వ్యవహారం పెళ్లి వరకు వెళ్తుందని అనుకున్నారు. కాని ఊహించని విధంగా ధోని, రాయ్ లక్ష్మీ ఏడాదిలోపే బ్రేకప్ చెప్పుకున్నారు. రాయ్ లక్ష్మీతో బ్రేకప్ తర్వాత మహేంద్ర సింగ్ ధోని సాక్షిని పెళ్లి చేసుకున్నాడని సెలబ్రిటీ వర్గాల్లో టాక్.

Chatrapathi : భీమిలి బీచ్‌లో ‘ఛత్రపతి’ షూటింగ్..

తాజాగా ధోనితో లవ్‌ ట్రాక్‌ నడిపిన విషయంపై రాయ్ లక్ష్మి స్పందించింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్ ధోని‌తో ఉన్న ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడింది. ఆయనతో రిలేషన్ తన జీవితంపై ఓ మచ్చగా మారిందని, ధోనితో బ్రేకప్ జరిగి దాదాపు 12 ఏళ్ళు గడిచిపోయినా ఆ విషయం తనను వెంటాడుతూనే ఉందని తెలిపింది. ధోని గురించి, ధోని లైఫ్ గురించి మీడియాలో ఏదైనా విషయంపై చర్చ జరిగినప్పుడు తన గురించి ప్రస్తావిస్తారని, రేపు నాకు పెళ్లై, పిల్లలు ఉన్న తర్వాత కూడా ఇలాగే గుర్తు చేస్తారేమో అంటూ బాధపడింది.

Rahul sipligunj : వార్ వన్‌ సైడ్.. సన్నీకి సపోర్ట్ చేస్తున్న రాహుల్

సంవత్సరం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత ధోని, నేను సామరస్యంగా విడిపోవాలని అనుకున్నట్లు, ఎలాంటి గొడవలు లేకుండా బ్రేకప్ చెప్పుకున్నట్లు రాయ్ లక్ష్మి తెలిపింది. బ్రేకప్ జరిగినా తమకు ఒకరిపై మరొకరికి రెస్సెక్ట్ ఉందని, ధోని తర్వాత కూడా తన జీవితంలో చాలా బ్రేకప్స్ జరిగాయని అయినా తానెప్పుడూ బాధపడలేదని వెల్లడించింది. ప్రస్తుతం లైఫ్ ని హ్యాపీగా గడుపుతున్నానని, కెరీర్ పైనే ద్రుష్టి పెట్టానని రాయ్ లక్ష్మి తెలిపింది. మొత్తానికి ఈ బ్యూటీ గతంలో చేసిన పని ఇంకా తనను వెంటాడుతోందని చెప్తుంది.