Raja : సినిమాలపై విమర్శలు చేసిన రాజా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. | Raja Comments on Movies and trolled by netizens

Raja : సినిమాలపై విమర్శలు చేసిన రాజా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

తాజాగా రాజా చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తనకి లైఫ్ ఇచ్చిన సినిమాలపైనే విమర్శలు చేశాడు. దీంతో నెటిజన్స్ రాజాని విపరీతంగా ట్రోల్..................

Raja : సినిమాలపై విమర్శలు చేసిన రాజా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Raja :  ఒక‌ప్పుడు తెలుగులో వెన్నెల, ఆనంద్ సినిమాలతో మెప్పించిన రాజా ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు హీరోగా చేసినా అంతగా విజయం సాధించలేదు. హీరోగా సక్సెస్ అవ్వకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలు చేశాడు. తర్వాత సినిమాలకి దూరమయి పాస్టర్ గా మారాడు రాజా. సినిమాల నుంచి పూర్తిగా దూరమైన రాజా పాస్టర్ నుంచి క్రిస్టియ‌న్ మ‌త ప్ర‌చార‌కుడిగా మారాడు. ప్రస్తుతం పలు చర్చిలలో, క్రిస్టియన్ ఈవెంట్లలో ప్రచారాలు, ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. అయితే తాజాగా రాజా చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తనకి లైఫ్ ఇచ్చిన సినిమాలపైనే విమర్శలు చేశాడు. దీంతో నెటిజన్స్ రాజాని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమాలపై రాజా మాట్లాడిన ఓ వీడియో బయటకి వచ్చింది.

 

ఈ వీడియోలో రాజా మాట్లాడుతూ.. ”శుక్రవారం వచ్చింది అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి ఎగబడతారు ఎందుకు? ఆ పనికిమాలిన సినిమాలు చూడటం వల్ల మీకేమొస్తుంది. గంట సేపు లైన్లో నిలబడి టికెట్ల కోసం కొట్టుకొని మూడు గంటల సేపు సినిమా చూసే బదులు ఆ నాలుగు గంటలు మీ తల్లితండ్రులు, కుటుంబీకులు, బంధువుల కోసం ప్రార్ధించండి. ఇంత చెడుతనం మన చుట్టూ పక్కన ఉన్నా మనం చలనం లేకుండా ఉంటే ఎందుకు? ఆ సినిమాలు చూసే బదులు ప్రభువుని ప్రార్ధించండయ్య. ఇప్పుడు సినిమాలని తిరిగితే జీవితంలో లాస్ట్ డే మ‌న‌కు దేవుడు చూపిస్తాడు సినిమా. అందుకే ప్రార్ధించండి” అని వ్యాఖ్యలు చేశారు.

Ritika Nayak : చేసింది సెకండ్ హీరోయిన్‌గా ఒక్క సినిమా.. హీరోయిన్‌గా మూడు సినిమాల డీల్..

దీంతో రాజా సినిమాలపై ఇలా నెగిటివ్ గా విమర్శలు చేయడంతో ఈ వీడియోని వైరల్ చేసి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఒకప్పుడు నీకు అన్నం పెట్టిన సినిమానే విమర్శిస్తున్నావా? ఈ యాక్టింగ్ ఏదో అప్పుడు సినిమాల్లో చేసి ఉంటే ఇప్పుడు ఇలా మాట్లాడే వాడివి కాదుగా, సినిమాల్లో నటించిన నువ్వే ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడుతున్నావా? అంటూ రాజాపై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

×