Rajamouli: ‘బ్రహ్మాస్త్ర’కు రాజమౌళి సాయం.. మామూలుగా ఉండదట!

బాలీవుడ్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందు రావడానికి రెడీ అయ్యింది. ఈ సినిమాకు సాయం చేసేందుకు రంగంలోకి దిగారు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి. ఆయన ఈ సినిమాను తెలుగులో ప్రెజెంట్ చేస్తుండటంతో ఇటు దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా ఈ సినిమాపై అందరి చూపులు పడ్డాయి.

Rajamouli: ‘బ్రహ్మాస్త్ర’కు రాజమౌళి సాయం.. మామూలుగా ఉండదట!

Rajamouli: బాలీవుడ్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందు రావడానికి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించగా, బాలీవుడ్ హిట్ పెయిర్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

Brahmastra: బ్రహ్మాండంగా మొదలైన బ్రహ్మాస్త్ర అడ్వాన్స్ బుకింగ్స్!

అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు కష్టకాలం ఉందని చెప్పాలి. అక్కడ బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్ కారణంగా ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్లుగా మిగిలాయి. దీంతో బ్రహ్మాస్త్ర చిత్రంపై కూడా ఈ ప్రభావం పడుతుందని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమాకు సాయం చేసేందుకు రంగంలోకి దిగారు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి. ఆయన ఈ సినిమాను తెలుగులో ప్రెజెంట్ చేస్తుండటంతో ఇటు దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా ఈ సినిమాపై అందరి చూపులు పడ్డాయి.

Brahmastra Pre Release Event : బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. నష్టం ఎన్ని కోట్లో తెలుసా??

జక్కన్న సినిమాలు యావత్ ఇండియావైడ్‌గా ప్రేక్షకులను అలరిస్తూ ఉండటంతో, ఆయన ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారంటే.. ఖచ్చితంగా ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ ఉండి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మరి ఈ సినిమాకు రాజమౌళి సాయం ఎంతవరకు కలిసొస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.