Rajamouli: మహేష్‌తో సినిమాపై పూర్తి ప్లానింగ్‌తో ఉన్న జక్కన్న..?

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో సందడి చేయడంతో రాజమౌళి పేరు విశ్వవ్యాప్తంగా మార్మోగిపోతుంది.

Rajamouli: మహేష్‌తో సినిమాపై పూర్తి ప్లానింగ్‌తో ఉన్న జక్కన్న..?

Rajamouli Planning High For Movie With Mahesh Babu

Rajamouli: స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో సందడి చేయడంతో రాజమౌళి పేరు విశ్వవ్యాప్తంగా మార్మోగిపోతుంది.

Rajamouli : మత వివాదంలో చిక్కుకున్న రాజమౌళి..

ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు సంపాదించడంతో, ఇప్పుడు అందరి చూపులు ఈ పాట ఆస్కార్ అవార్డు గెలుపుపై పడ్డాయి. కాగా, ఈ సినిమా తరువాత జక్కన్న తన నెక్ట్స్ మూవీని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేయబోతున్నట్లు ఇప్పటికే వెల్లడించాడు. ఇక ఈ సినిమాను పూర్తి అడ్వెంచరస్ మూవీగా రాజమౌళి తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు.

Rajamouli-Mahesh : ఆస్కార్ వేడుక అయితే కానీ రాజమౌళి-మహేష్ సినిమా వర్క్ మొదలవ్వదేమో??

కాగా, ఈ సినిమా కోసం జక్కన్న పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్టు పనులు శరవేగంగా జరుగుతుండగా, ఆర్ఆర్ఆర్ ఆస్కార్ పనులు ముగియగానే జక్కన్న ఈ స్క్రిప్టుపై ఫోకస్ మార్చేందుకు రెడీ అవుతున్నాడట. ఇక ఈ సినిమ ప్రీ-ప్రొడక్షన్ పనులను ఈయేడాది ద్వితీయార్థంలో మొదలుపెట్టేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. అటుపై ఈ సినిమా షూటింగ్‌ను జనవరి 2024లో స్టార్ట్ చేసేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడట. అయితే ఈ షూటింగ్ కంటే ముందే, మహేష్ రెండు నెలల భారీ బల్క్ డేట్లు ఈ సినిమా వర్క్‌షాప్ కోసం కేటాయించనున్నాడట. మొత్తానికి మహేష్‌తో మూవీపై జక్కన్న అప్పుడే ఫుల్ ప్లానింగ్‌తో ఉన్నట్లుగా తెలుస్తోంది.