Rajamouli : ఎన్టీఆర్ ఐబ్రోస్‌తో కూడా నటించగలడు
ఆస్కార్ ఓటింగ్ కోసం ఎన్టీఆర్, రాజమౌళి మరోసారి అమెరికాకి వెళ్లారు. నేడు జరిగిన ఓ కార్యక్రమంలో హాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ, జర్నలిస్ట్స్, ఆస్కార్ మెంబర్స్ తో మాట్లాడారు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజమౌళి మాట్లాడుతూ...............

Rajamouli : రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఈ సినిమాని, రాజమౌళిని పొగిడేశారు. ఇక రాజమౌళి ఈ సినిమాని ఆస్కార్ వరకు తీసుకువెళ్లాలి అని కొన్ని నెలలు అమెరికాలోనే ఉండి గట్టిగా ప్రమోట్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమాకి పలు విభాగాల్లో ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి. కొన్ని హాలీవుడ్ అవార్డులు కూడా RRR సినిమాకి వరించాయి.
RRR సినిమాని ఆస్కార్ నామినేషయాన్స్ లో నిలబెట్టడానికి రాజమౌళి అనేక ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ ని ప్రకటించగా అందులో నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్స్ లో నిలిచింది. ఆస్కార్ ప్రకటించే ముందు ఆస్కార్ ఓటింగ్ కోసం కొన్ని ప్రివ్యూలు వేసి అక్కడ వాళ్ళతో సినిమా గురించి చర్చిస్తారు.
Sankranthi Movies : దిల్‌రాజు వర్సెస్ చిరు, బాలయ్య ఫ్యాన్స్.. ఈ సారి ఫ్యాన్ వార్స్ లేవు..
ఈ ఆస్కార్ ఓటింగ్ కోసం ఎన్టీఆర్, రాజమౌళి మరోసారి అమెరికాకి వెళ్లారు. నేడు జరిగిన ఓ కార్యక్రమంలో హాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ, జర్నలిస్ట్స్, ఆస్కార్ మెంబర్స్ తో మాట్లాడారు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజమౌళి మాట్లాడుతూ.. నా కెరీర్ లో నేను డైరెక్ట్ చేసిన బెస్ట్ సీన్ కొమరం భీముడో సీన్. ఎన్టీఆర్ చాలా గొప్ప పర్ఫార్మర్. అతని ఐబ్రోస్ మీద కెమెరా క్లోజ్ పెట్టినా కేవలం ఐబ్రోస్ తో కూడా నటించగలడు. అంత గొప్ప నటుడు ఎన్టీఆర్ అని అన్నాడు. దీంతో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ వ్యాఖ్యలని షేర్ చేస్తున్నారు.
#KomuramBheemudo is my all time favourite in all of my films & that scene is the best thing which I have ever directed in my career. Even if the Camera is only on 1 eye brow, & #NTR can perform with the Eye brow?
"Peak Elevation"?
– #SSRajamouli#NTRforOSCARS #NTRGoesGlobal pic.twitter.com/MxrybMSjP8
— ????????? (@CineMaagic) January 8, 2023